Turtle attack on woman : మహిళపైకి భయంకరంగా దాడి చేసిన తాబేలు

మనుష్యులతో జంతువులు ఫ్రెండ్లీగా ఉన్నట్లే ఉంటాయి. అంతలోనే విచిత్రంగా దాడులు చేస్తుంటాయి. ఏ మాత్రం అప్రమత్తత లేకపోయినా అవి ఏ రకంగా దాడి చేస్తాయో ఊహించలేం. మంచినీరు అందిస్తున్న ఓ మహిళపైకి తాబేలు ఎలా అటాక్ చేసిందో చూడండి.

Turtle attack on woman : మహిళపైకి భయంకరంగా దాడి చేసిన తాబేలు

Turtle attack on woman

Turtle attack on woman :  తాబేళ్లు చాలా సైలెంట్ గా ఉంటాయని అందరూ అనుకుంటారు కదా.. కానీ అవి కూడా శబ్దాలు చేస్తాయట.. కానీ మనకు వినపడవు. ఇది ఇలా ఉంచితే మనుష్యుల మీదకు అటాక్ కూడా చేస్తాయట.. వీటికి అంత శక్తి ఉందా? అని మీరు అనుకుంటున్నారా? మంచినీరు అందిస్తున్న ఓ మహిళపైకి తాబేలు ఎలా దాడి చేసిందో చూడండి.

Switzerland Zoo: జూలో పుట్టిన అరుదైన తాబేలు.. ప్రపంచంలోనే మొదటిసారిలా

తాబేళ్లకు సంబంధించి నెట్‌లో అనేక వీడియోలు ఉన్నాయి. వాటికి దూకే శక్తి కూడా ఉంటుంది. అంతే కాదు మనుష్యుల మీద అటాక్ కూడా చేస్తాయట. నిజమే.. కంచెకు అవతల ఉన్న  తాబేలుకు ఓ మహిళ మంచినీరు అందించింది. అది సైలెంట్‌గా మంచినీరు తాగుతూనే ఒక్కసారిగా ఆమెపైకి అటాక్ చేసింది. చూసే వారికి గుండె ఝల్లుమనిపించే ఈ వీడియో @StrangestMedia అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోను లక్షల్లో జనం చూసారు.

Oldest Tortoise: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 190 ఏళ్ల తాబేలు

“తాబేలు అలా అటాక్ చేస్తుందని ఆమె ఊహించి ఉండదని” కొందరు.. “కెమెరా మీదకు ఒక్కసారిగా జంప్ చేసిందని.. చూస్తుంటే చాలా భయం వేసిందని”జనం అభిప్రాయపడ్డారు.