Switzerland Zoo: జూలో పుట్టిన అరుదైన తాబేలు.. ప్రపంచంలోనే మొదటిసారిలా

 స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో అరుదైన తాబేలు జన్మించింది. గురువారం, స్విట్జర్లాండ్‌లోని సర్వియన్‌లోని ట్రోపిక్వేరియం జూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేయగా వాటి సైజు చాలా పెద్దదిగా ఉందని పేర్కొంది.

Switzerland Zoo: జూలో పుట్టిన అరుదైన తాబేలు.. ప్రపంచంలోనే మొదటిసారిలా

Tortoise

Updated On : June 13, 2022 / 7:09 AM IST

Switzerland Zoo: స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో అరుదైన తాబేలు జన్మించింది. గురువారం, స్విట్జర్లాండ్‌లోని సర్వియన్‌లోని ట్రోపిక్వేరియం జూ ఈ విషయాన్ని కన్ఫామ్ చేయగా వాటి సైజు చాలా పెద్దదిగా ఉందని పేర్కొంది. ఇటీవలే రెండు బేబీ జెయింట్ గాలాపాగోస్ తాబేళ్లను స్వాగతించినట్లు ప్రకటించింది. ఒక తాబేలు దాని తల్లిదండ్రుల మాదిరిగానే ముదురు రంగుతో ఉంటే మరొక తాబేలుకు అల్బినిజం ఉంది.

జాతుల్లోనే ఇది అరుదైనది కాగా, ఈ పిల్ల తాబేళ్ల లింగాన్ని ఇంకా నిర్ణయించలేదు.

“ట్రోపిక్వేరియంలో నమ్మశక్యంకాని జననం! మా బేబీ గాలాపాగోస్ జెయింట్ తాబేళ్లలో అల్బినో శిశువు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఇది జంతుప్రదర్శనశాలలలో లేదా అడవిలో ఎప్పుడూ చూడని విషయం” అని జూ సోషల్ మీడియాలో అరుదైన తాబేలు ఫోటోలను పంచుకుంది.

Read Also: గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన 190 ఏళ్ల తాబేలు

“ఈ అంతరించిపోతున్న ప్రత్యేకించి అల్బినో లాంటి జాతి తాబేళ్ల జాతి పుట్టడమనేది అరుదైన, అసాధారణమైన విషయం. అల్బినో గాలాపాగోస్ తాబేలు పుట్టి బందిఖానాలో ఉంచటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. మానవులలో 20వేల మందిలో ఒకరు ఎలా అరుదుగా ఉంటారో.. అలాగే 100,000 తాబేళ్లలో అల్బినిజం చాలా అరుదు”

ఫిబ్రవరి 11న తల్లి తాబేలు ఐదు గుడ్లు పెట్టడంతో మే 1న అల్బినో పిల్ల తాబేలు పొదిగింది. మరో తాబేలు మే 5న పొదిగింది.