Lidia Hurricane
Mexico : అత్యంత ప్రమాదకరమైన లిడియా హరికేన్ మెక్సికో దేశాన్ని వణికిస్తోంది. ఈ లిడియా హరికేన్ మంగళవారం మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరాన్ని తాకింది. మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరంలో ఉన్న ప్యూర్టో వల్లర్టా వద్ద తుపాన్ తీరం దాటడంతో కేటగిరి 4 తుపానుగా మారిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.తరచూ తుపాన్లు సంభవిస్తుండటంతో ఆస్తి నష్టం జరుగుతోంది.
Also Read :UP Cabinet expansion : నవరాత్రివేళ యూపీ మంత్రివర్గ విస్తరణ…కొత్తవారికి చోటు
లిడియా ప్యూర్టో వల్లార్టా బీచ్ రిసార్ట్ సమీపంలో తీరాన్ని తాకిన ఈ లిడియా తుపాన్ వల్ల గరిష్ఠంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఈ తుపాన్ విపత్తు వల్ల భారీ గాలులతోపాటు భారీవర్షాలు కురిశాయి. లిడియా తుపాన్ వల్ల మెక్సికో దేశం అతలాకుతలమైంది.