సమర్థవంతమైన,ప్రపంచంలోనే బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉన్నప్పటికీ కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి ఇటలీ సిద్ధంగా లేదనే కాస్ఫన్ తో ఓ ఫొటోను చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరోనా దెబ్బకి ఇటలీలో జనం పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. రోజురోజుకు గుట్టలుగుట్టలుగా శవాలు పెరుకుపోతున్నాయి. శావాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్లను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు.
కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసినట్లు బోరున విలపించినట్లు ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కరోనావైరస్ ను నియంత్రించడంలో ఇటలీ విఫలమయింది. ఎందుకంటే వారు దీనిని ప్రారంభ రోజులలో ఒక జోక్ గా తీసుకుంటున్నారు. ఈ రోజు వారి అధ్యక్షుడు కరోనావైరస్ బారిన పడిన మృతదేహాలను ఖననం చేయడానికి మాకు స్థలం తక్కువగా ఉందని భోరున ఏడేశ్చారు అంటూ ఆ ఫొటోను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అయితే ఆ ఫొటోలో కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి ఇటలీ అధ్యక్షుడు కాదు. నెటిజన్లు ఇటలీ అధ్యక్షుడు అంటూ షేర్ చేసిన ఫొటోలో ఉంది బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో. 2019 డిసెంబర్ 17న బ్రెజిల్ లోని పలాసియో డో ప్లెనాల్టో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగ సమయంలో..తన కూతురి గురించి మాట్లాడుతున్న సమయంలో బోల్సోనారో కన్నీళ్లు పెట్టుకున్నప్పటి ఫొటోనే ఇప్పుడు నెటిజన్లు ఇటలీ అధ్యక్షుడు అనే తప్పుడు ప్రచారంతో షేర్ చేస్తున్న ఫొటో.
ప్రస్తుత ఇటలీ అధ్యక్షుడి పైరు సెర్గియో మాటారెల్లా
మరోవైపు ఇటలీలో కరోనా మరణాలు వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఎక్కువయ్యాయి. ఇటలీలో ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 5,500. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే వృద్ధా జనాభా ఎక్కువ ఉన్న దేశం జపాన్ కాగా,వృద్ధ జనాభా అధికంగా ఉన్న రెండో దేశం ఇటలీనే. కరోనా వృద్ధులపైనే అధిక ప్రభావం చూపిస్తుండటంతో అక్కడ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.
See Also | కరోనా ముప్పు, లోక్‌సభ నిరవధిక వాయిదా