Maryland USA
Maryland USA : భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న మోదీ అభిమాని ఒకరు తన కారు నంబర్ ప్లేట్ మీద మోదీ పేరును ప్రదర్శిస్తూ ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.
PM Modi America Tour: మోదీ అమెరికా పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం ..
మోదీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండే తెలుగువారు మోదీపై అభిమానం చాటుకుంటారు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్‌లో ఉండే మోదీ వీరాభిమాని రాఘవేంద్ర తన కారు నంబర్ ప్లేట్‌ను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. మోదీ తనకెంతో స్ఫూర్తి అని చెప్పే రాఘవేంద్ర 2016 లోనే తన కారు నంబర్ ప్లేట్‌పై ‘NMODI’ అని రాయించుకున్నారు. మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాఘవేంద్ర చెబుతున్నారు.
మోదీ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ బయట భారత త్రివర్ణ పతాకం కనిపించింది. మోదీ జూన్ 20-24 వరకు యుఎస్ కాంగ్రెస్ జాయింట్ సిట్టింగ్‌ను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. అమెరికన్ రాజకీయ నేతలు, ప్రముఖ వ్యక్తుల్ని కలవబోతున్నారు. జూన్ 21 న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోదీ నాయకత్వం వహిస్తారు.
#WATCH | A ‘fan’ of PM Narendra Modi flaunts “NMODI” car number plate in Maryland, USA pic.twitter.com/AO5WRwdGoa
— ANI (@ANI) June 17, 2023