బంగ్లాదేశ్‌లో ఫొని బీభత్సం: 15మంది మృతి

  • Publish Date - May 5, 2019 / 04:04 AM IST

మూడు రాష్ట్రాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫొని తుఫాన్ పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ చేరింది. బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన ఫొని తుఫానక అక్కడ బీభత్సం సృష్టించింది. తీవ్రమైన గాలులు జనజీవనాన్ని అతలాకుతలం చేయగా.. ఆ దేశంలో తుఫాను ప్రభావంతో ఇప్పిటివరకు 15మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఈదురు గాలులు దెబ్బకు అక్కడి రవాణా వ్యవస్త అస్తవ్యస్తం కాగా.. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఫోని బీభత్సం కారణంగా 330 ఎకరాలు పంట భూమి పూర్తిగా నాశనం అయింది. 53 వేల ఎకరాల పంట భూమి పాక్షికంగా దెబ్బతింది. 2243 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 11.172 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 3800 మెట్రిక్ టన్నుల ఆహార పదార్ధాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఫొని ప్రభావం ఉత్తరాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాల్లో కొద్దిగా కనిపించగా.. వంద‌లాది చెట్లు నేలకు ఒరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలాయి. ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ స‌హా, గంజాం, పూరీ, క‌ట‌క్‌, కేంద్ర‌పారా, గ‌జ‌ప‌తి, బ్ర‌హ్మ‌పూర్‌, న‌యాగ‌ఢ్ వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిశాయి.