J&j
Johnson & Johnson Vaccine ఇప్పటికే అమెరికాలో దాదాపు పక్కుకుపెట్టబడిన జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్ కి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDI) బిగ్ షాక్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సోమవారం ఎఫ్ డీఐ హెచ్చరించింది. గుయిల్లెయిన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని, అయితే అది ఇంకా పూర్తిగా నిర్థారణ కాలేదని ఎఫ్ డీఐ పేర్కొంది. గుయిల్లెయిన్ బారే సిండ్రోమ్ అంటే…శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున సొంత నాడీ కణాలపై దాడి చేసినప్పుడు గులెయిన్ బారే సంభవిస్తుంది. దీంతో కండరాల బలహీనత ఏర్పడుతుంది. ఒక్కోసారి పక్షవాతం బారినపడొచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) అంచనా ప్రకారం.. ఏటా 3-6 వేల మందికి పలు కారణాలతో ఈ వ్యాధి సోకుతుంది.
జాన్సన్ టీకా తీసుకునేవారికి ఇచ్చే పాంప్లెట్లో కొత్త హెచ్చరికను ఎఫ్డీఏ చేర్చనుంది. దాని ప్రకారం జలదరింపులు, నడవటంలో ఇబ్బంది, ద్వంద్వ దృష్టి లాంటి లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. జాన్సన్ టీకా తీసుకొని, గులెయిన్ బారే వ్యాధి బారిన పడిన 100 మంది రిపోర్టులను సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షెన్(సీడీసీ)తో పాటు సమీక్షించిన తర్వాత ఎఫ్డీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ కేసులలో తొంభై ఐదు శాతం తీవ్రమైనవని ఎఫ్ డీఐ పేర్కొంది. టీకా తీసుకున్న 42 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయని, కానీ ఈ కేసులు అత్యంత అరుదని తెలిపింది. జీబీఎస్ లక్షణాలతో ఇప్పటికే ఒకరు మరణించినట్లు తెలిపింది.
అయితే ఇప్పటివరకు 1.3 కోట్ల మంది అమెరికన్లు జాన్సన్ టీకా తీసుకోగా, ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య చాలా స్వల్పం. 50 ఏళ్లు పైబడిన వారిలో టీకా తీసుకున్న 2 వారాల తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక, ఈ నివేదికలపై ఎఫ్డీఏ సహా ఇతర ఆరోగ్య నియంత్రణ సంస్థలతో చర్చిస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్స్ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఎమర్జెన్సీ అనుమతి దక్కిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలో ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.