Donald Trump: ఏందిది..? ఇదేం ఆర్డర్?.. ట్రంప్ కు షాకిచ్చిన జడ్జి.. ఇండియన్స్ ఫుల్ ఖుష్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది.

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ తగిలింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత.. వలస వచ్చి అమెరికాలో పుట్టిన పిల్లలకు సహజంగా ఇచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దుచేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. ట్రంప్ ఇచ్చిన జన్మత: పౌరసత్వం ఆదేశాలను కోర్టు అడ్డుకోవటంతోపాటు తాత్కాలికంగా నిలిపివేసింది.

 

డొనాల్డ్ ట్రంప్ జన్మత: పౌరసత్వ చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో విపక్ష డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ పాలనలోఉన్న వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగన్ రాష్ట్రాలతోపాటు.. అమెరికాలోని 22 రాష్ట్రాల పరిధిలో మొత్తం ఐదు న్యాయ వ్యాజ్యాలు కోర్టుల్లో దాఖలయ్యాయి. వాటిల్లో ఒకదానిపై సియాటిల్ పెడరల్ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా.. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వం చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాలని న్యాయవాదులు వాదించారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా దీన్ని గతంలో బలపర్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న సియాటిల్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జాన్ కాఫ్నర్ .. ‘జన్మత: పౌరసత్వ చట్టాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేశారు’.

 

న్యాయమూర్తి తీర్పు ప్రకారం.. 14రోజులపాటు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అమలు చేయడానికి వీల్లేందని ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈలోగా ట్రంప్ ఆర్డర్ పై తదుపరి వాదనలను కోర్టులో వినిపించనున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నందున ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను దీర్ఘకాలికంగా నిషేధించాలా వద్దా అనేది నిర్ణయించడానికి న్యాయమూర్తి ఫిబ్రవరి 6వ తేదీన మరోసారి విచారణను వాయిదా వేశారు. ఇదిలాఉంటే.. విచారణ సందర్భంగా ‘‘ఇదో కఠోరమైన రాజ్యాంగ విరుద్ధ ఆర్డర్’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

 

అమెరికాలో పుట్టిన పిల్లలకు జన్మత: లభించే పౌరసత్వ హక్కు ఫిబ్రవరి 20వ తేదీ తరువాత లభించదంటూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంతో వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. అయితే, ట్రంప్ నిర్ణయాన్నిసియాటిల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా అడ్డుకోవటంతో అమెరికాలోని విదేశీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయుల్లో చాలా మంది వర్కింగ్ వీసాలపై అమెరికాలో ఉద్యొగాలు చేస్తున్నారు. వీరంతా హెచ్-1బీ వీసాలతో టెంపరరీ వర్క్ చేసేవారు చాలా మంది ఉన్నారు. కొంత మంది గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపై వారికి ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం లభించదు. అయితే, తాజాగా కోర్టు తీర్పుతో ఆమెరికాలోని భారతీయుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులు పూర్తిగా అడ్డుకుంటాయన్న భరోసాను వారు వ్యక్తం చేస్తున్నారు.