ఫైనల్ ఆన్సర్ అదే…అమెరికా బలగాలను తరిమికొడతాం

అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహానీ. జనరల్ ఖాసిమ్ సోలేమానీని హత్య చేసి అమెరికా చాలా పెద్ద తప్పు చేసిందన్న ఆయన సోలేమానీ మృతికి ఫైనల్ రెస్ఫాన్స్.. తమ ప్రాంతంలోని యూఎస్ దళాలను తరిమికొట్టడమేనన్నారు.ఐసిస్, అల్ ఖైదా, అల్ నుస్రహ్ కు వ్యతిరేకంగా సోలేమానీ చారిత్ర్ పోరాటం చేశారన్నారు రౌహానీ.

సోలేమానీ కనుక ఉగ్రవాదంపై పోరాడి ఉండకుంటే యూరోపియన్ దేశాలు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉండేవన్నారు. క‌మాండ‌ర్ సులేమానీని హ‌త్య చేసి కుద్స్ ఫోర్స్ చేతిని అమెరికా న‌రికి వేసి ఉంటుంది, కానీ మ‌ధ్య‌ప్రాశ్చ్యంలో అమెరికా కాళ్ల‌ను మేం న‌రికివేస్తాం అని ఇరాన్ అధ్య‌క్షుడు హ‌స‌న్ రోహ‌నీ తెలిపారు. అంతకుముందు ఇరాన్ సుప్రీం నేత అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ మాట్లాడుతూ…అగ్ర‌రాజ్యం అమెరికాకు చెంప దెబ్బ రుచి చూపించామ‌న్నారు. ఇరాక్‌లో ఉన్న రెండు అమెరికా స్థావ‌రాల‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు చేసిన అనంత‌రం ఖ‌మేనీ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనికులంతా దేశాన్ని విడిచి వెళ్లాల‌న్నారు. మ‌ధ్య‌ప్రాశ్చ్యంలో అమెరికా సైనిక ద‌ళాలు అవినీతికి మూలంగా మారాయ‌న్నారు. అమెరికాను మేం శ‌త్రువుగా భావిస్తామ‌ని ఖ‌మేనీ అన్నారు. క‌మాండ‌ర్ సులేమానీని హ‌త్య చేసి కుద్స్ ఫోర్స్ చేతిని అమెరికా న‌రికి వేసి ఉంటుంది, కానీ మ‌ధ్య‌ప్రాశ్చ్యంలో అమెరికా కాళ్ల‌ను మేం న‌రికివేస్తాం అని ఇరాన్ అధ్య‌క్షుడు హ‌స‌న్ రోహ‌నీ తెలిపారు.