fiona
Fiona: ఫియోనా అనే ఖడ్గ మృగానికి నాలుగో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. నిర్ణీత కాలం కంటే ముందే 2017 జనవరి 24న పుట్టిన తనకి బతకడమే కష్టమైపోయింది. కానీ, ఆశ్చర్యంగా ఫియోనాకు రీసెంట్‌గా నాల్గో బర్త్ డేను యునైటెడ్ స్టేట్స్‌లోని సిన్సిన్నాటి జూ, బొటానికల్ గార్డెన్ సెలబ్రేట్ చేశాయి.
ఇందులో భాగంగానే ఫియోనా కోసం పెద్ద ఎత్తులో అభిమానులను ఆహ్వానించింది ఓహియో జూ. ప్రత్యేక ఈవెంట్ ను క్రియేట్ చేసి డజన్ల కొద్దీ యాపిల్స్ తో కేక్ రెడీ చేసింది. ఆ కేక్‌ను ఐస్, పండ్లతో కలిపి రెడీ చేశారు. అక్కడే ఉన్న ఒక విరిగిపడిన చెట్టుకు ఆనించి కేక్ ను ఉంచారు. ఒక గదిలా ఉంచి ఆ గోడలపైనా సెలబ్రేషన్‌కు సంబంధించి పెయింటింగ్స్ వేశారు.
నిదానంగా వచ్చిన ఫియోనా గోడలను చూసుకుంటూ కేక్ కొరికి తినింది. ఈ సీన్ మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఫియోనా ప్రొడక్ట్స్ అని ప్రత్యేక రోజుని భారీగా సెలబ్రేట్ చేశారు. గ్రేటర్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ తో ఫియోనా కోసం రెడీ చేసిన కేక్‌ను మిగిలిన వారికి కూడా పంచారు నిర్వాహకులు.