అమెరికాలో మళ్లీ కార్చిచ్చు కలకలం రేపింది. నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రాణనష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేలాది మంది ప్రజలకు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కార్చిచ్చు ప్రభావాన్ని తగ్గిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతోంది. సౌత్ కరోలినాలో ఇప్పటికే 4.9 చదరపు కి.మీ. మేర అటవీ భూమిలో కార్చిచ్చు వల్ల చెట్లు మసైపోయాయి.
కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టం ఏమీ సంభవించలేదని అధికారులు తెలిపారు. సౌత్ కరోలినాలో ఎమర్జెన్సీ విధించారు. ఈ మేరకు గవర్నర్ హెన్రీ మెక్ మాస్టర్ ప్రకటన చేశారు. 175 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని అన్నారు.
Also Read: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌పై హర్భజన్ కామెంట్స్.. అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదంటూ..
నార్త్ కరోలినాలో 4 ప్రాంతాల్లో కార్చిచ్చు వల్ల 400 ఎకరాల అటవీ భూమి కాలిపోయింది. నార్త్ కరోలినాలోని పోల్క్ కౌంటీలో ప్రజల తరలింపు ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది నార్త్ కరోలినాలోని అషేవిల్లెకు ఆగ్నేయంగా 40 మైళ్ల దూరంలో దాదాపు 600 ఎకరాల భూమిని నాశనం చేసిన కార్చిచ్చును ఆపడానికి దానిచుట్టు కంటైన్‌మెంట్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కార్చిచ్చును సోమవారం సాయంత్రం 63 శాతం తగ్గేలా చేశామని పోల్క్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అధికారులు చెప్పారు.