Attack in Israel : ఇజ్రాయిల్‌లో దుండగుడు కాల్పులు..ఐదుగురు మృతి

ఇజ్రాయిల్‌లో దుండగుడు కాల్పులు జరుపగా ఐదుగురు మృతి చెందారు.

5 killed in latest deadly attack in Israel : ఇజ్రాయిల్‌ మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టెల్ అవివ్ శివారులోని బినెయి బ్రాక్ ప్రాంతంలో ఓ దుండ‌గుడు తుపాకి పట్టుకుని వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. గత వారం రోజుల్లో ఇటువంటి దాడి జరగటం మూడవసారి. అల్ట్రా-ఆర్థోడాక్స్ యూదు ప్రాంతాలలో ఒకటైన బినెయి బ్రాక్ (Bnei Brak) ప్రాంతంలో
యూదులు అధిక సంఖ్య‌లో ఉంటారు. ఈ ప్రాంతంలో తుపాకితో దుండుగుడు కాల్పులు జరుపగా ఐదుగురు చనిపోయాడు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడికి కాల్చి చంపారు. ఇజ్రాయెల్ మీడియా నివేదికలు ప్రకారం..దాడి చేసిన వ్యక్తి 27 ఏళ్ల పాలస్తీనియన్ అని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు ఉత్తరాన ఉన్న గ్రామానికి చెందినవాడు అని వెల్లడించింది.

Also read : Covid New Variant: ఇజ్రాయెల్ లో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్

గత ఆదివారం, మంగళవారం ఇజ్రాయెల్ అరబ్బులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఈ దాడులతో సెక్యూర్టీ ద‌ళాలు హై అల‌ర్ట్‌లో ఉన్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు మృతిచెందారు. న‌ల్ల దుస్తులు ధ‌రించి, చేతిలో అటోమెటిక్ వెప‌న్‌తో ఉన్న వాహ‌నంపై వ‌చ్చిన ఆ దుండ‌గుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జ‌రిపాడు. ఒక‌రు వాహ‌నంలో చ‌నిపోగా, మ‌రికొంత మంది వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నారు.
ఈ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌ధాని న‌ఫ్టాలీ బెన్నెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్‌లో అర‌బ్ ఉగ్ర‌వాదం పెరిగింది అని ఆరోపించారు. సెక్యూర్టీ ద‌ళాలు రంగంలోకి దిగాయ‌ని, ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొంటాం అని తెలిపారు. దాడిని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. ఇజ్రాయెలీలు – ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలాగే శాంతితో మరియు భయం లేకుండా జీవించాలి అని కోరుకున్నారు.

Also read : Imran Khan : అవిశ్వాస పరీక్షకు ముందే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ కు పదవీగండం

ఈ ఘటనలపై ఇజ్రయెల్ మాజీ ప్రధాని, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ..ఇజ్రాయెల్ “చాలా సంవత్సరాలుగా మనం చూడని భయంకరమైన తీవ్రవాదం పెరుగుతోంది అని ఆరోపించారు. ఇజ్రాయెల్ పౌరులకు శాంతి,భద్రతను పునరుద్ధరించడానికి కఠినమై చర్యలు తీసుకోవాలి” అని ప్రభుత్వానికి సూచించారు.కాగా..గాజాను పాలించే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఈ దాడిని ప్రశంసించింది: “దాడి చేసినవారికి మా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాము.”అని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు