Imran Khan : అవిశ్వాస పరీక్షకు ముందే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ కు పదవీగండం

సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇమ్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్‌ జరిగే రోజున జాతీయ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావద్దని తన పార్టీ సభ్యులను ఆదేశించారు.

Imran Khan : అవిశ్వాస పరీక్షకు ముందే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ కు పదవీగండం

Imran Khan

Pakistan PM Imran Khan : పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అవిశ్వాస పరీక్షకు ముందే పదవిని కొల్పోయే పరిస్థితి ఏర్పడింది. అవిశ్వాసానికి ముందే మిత్రపక్షమైన MQM పార్టీ విపక్షంతో చేతులు కలిపింది. అధికారానికి దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇమ్రాన్ పైన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేందుకు ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీ నేతలు సైతం సై అంటున్నారు. పాక్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసంపై చర్చ జరుగనుంది. ఏప్రిల్ 3న జరిగే ఓటింగ్‌తో ఇమ్రాన్‌ కథ కంచికా.. ప్రధాని కార్యాలయానికా తేలిపోనుంది.

సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఇమ్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటింగ్‌ జరిగే రోజున జాతీయ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావద్దని తన పార్టీ సభ్యులను ఆదేశించారు. పార్టీ అధ్యక్షుడిగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 ఏ నిబంధనకు అనుగుణంగా ఈ ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే అది ఫిరాయింపు చర్యలు తప్పవని తన పార్టీ సభ్యులను హెచ్చరించారు ఇమ్రాన్‌.
Imran Khan To Resign : పాకిస్తాన్ ప్ర‌ధాని ప‌ద‌వికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా..?

ఓటింగ్‌లో ఇమ్రాన్ గెలుస్తారని అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ తెలిపారు. ప్రధాని ఖాన్‌కు 342 మంది ఉన్న సభలో 172 ఓట్లు అవసరం. కానీ ఇప్పటికే మిత్రపక్షాలు కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటేసేందుకు డిసైడైనట్టు తెలుస్తున్నారు. తన సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో విదేశీ శక్తులు ప్రమేయం ఉందని ఇటీవల ఖాన్ నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రకటించారు.

ఇమ్రాన్‌ను పదవి నుంచి దించాలంటే ప్రతిపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం. పీటీఐకి చెందిన 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అవిశ్వాస తీర్మానంలో వారు ఇమ్రాన్‌కు మద్దతుగా ఓటేస్తారన్న నమ్మకం లేదు. అందుకే పార్టీ ఎంపీలకు జారీ చేసిన విప్ లో ఓటింగ్ లో పాల్గొనవద్దని స్పష్టం చేసారు. దీంతో..సభ్యులు దీనిని అనుసరిస్తారా.. లేక, ఇప్పుడున్న వ్యతిరేకుల సంఖ్య మరింత పెరుగుతుందా.. ఏప్రిల్ 3న ప్రధాని ఇమ్రాన్ రాజకీయ భవితవ్యం ఏం కానుందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.