Viral Video: హాయ్ బర్డ్స్ హౌ ఆర్ యూ..సముద్రంపై పక్షుల గుంపుతో దోబూచులాడిన భారీ తిమింగలం..

సముద్రంపై పక్షుల గుంపుతో దోబూచులాడిన భారీ తిమింగలం వీడియో భలే ముచ్చటగా ఉంది..అందుకే వైరల్ అవుతోంది.

Whale And Birds Viral Video

Whale And birds Viral video: సముద్రంలో చిన్న చిన్న అందమైన చేపల నుంచి అత్యంత భారీ తిమింగలాలు కూడా జీవిస్తుంటాయనే విషయం తెలిసిందే. చిన్న చేపల్ని పెద్ద చేపలి తిని జీవిస్తుంటే ఈ పెద్ద చేపల్ని షార్క్ చేపలు స్వాహా చేస్తుంటాయి. అలాగే భయంకరమైన షార్క్ చేపల్ని కూడా గుటకాయస్వాహా చేసేస్తుంటాయని తిమింగలాలు. అలాగే నోటికి అందిన పెద్ద పెద్ద జీవుల్ని తినేస్తుంటాయి. అటువంటి ఓ భారీ తిమింగలం పక్షులతో సరదా సరదా ఆటలు ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎంతో అందంగా..ముద్దుగా, వింతగా భారీగా కూడా కనిపించే సముద్రంలో ఉండే జలచరాలు ఎంత ప్రమాదకరమో అవి కూడా ఆసక్తికరంగా ఉంటాయి. అవి కొన్ని సార్లు చేసే పనులు విచిత్రంగా ఉంటాయి. అయితే..ఓ భారీ తిమింగలం పక్షుల సమూహం, సముద్ర పక్షులు చాలా సేపు సముద్రపు నీటిపై ఎగురుతూ గుంపులు గుంపులుగా ఎగురుతుంటాయి. చేపల్ని పట్టి తింటుంటాయి. అలా నీటిపై గుంపులు గుంపులుగా చక్కర్లు కొడుతుంటాయి. అలా కొన్ని పక్షుల గుంపు సముద్రపు నీటిపై చక్కర్లు కొడుతుండగా అనూహ్యంగా నీటిలో నుండి ఒక పెద్ద తిమింగలం నోరు తెరుచుకని బయటకు వచ్చింది.

వామ్మో అలా వచ్చిన ఆ తిమింగలం ఆ పక్షుల్లో కొన్నింటినైనా గుటకాయస్వాహా చేసేస్తుందని అనుకుంటాం. కానీ ఆ తిమింగలం మాత్రం ఆ పక్షుల గుంపుతో సరదాగా వ్యవహరించింది. ఓ తిమింగలం వేట కోసం గంతులు వేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అలా ఏం చేయాలేదు. కానీ మరుసటి క్షణంలో నీటిలో నుంచి ఒక తిమింగలం వచ్చి పక్షులను టచ్ చేస్తుంది. అయితే, ఈ వీడియో చూసిన తర్వాత ఈ పక్షులను వేటాడాలనే ఉద్దేశ్యంతో తిమింగలాలు నీటిలో నుంచి బయటకు రావడం వింతగా అనిపిస్తుంది.ఆ తిమింగలం పక్షులకు ‘హాయ్’ చెప్పడానికి నీటి నుంచి బయటకు వచ్చినట్లుగా ఉంది ఈ సీన్ చూస్తే..

ఆ తిమింగలం ఏ పక్షిని కూడా తినలేదు కనీసం తినడానికి కూడా యత్నించకపోవటం విశేషం. అలా పక్షుల్ని సుతారంగా అంటీ అంటనట్లుగా ముట్టుకుని నెమ్మదిగా నీటిలోకి తిరిగి వెళ్లిపోతుంది. whales_orcas అనే ఖాతా ద్వారా ఈ మనోహరమైన వీడియో Instagramలో షేర్ చేయబడింది. ఈ వీడియోకు ఓ ఆసక్తికరమైన శీర్షిక జోడించింది.

ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్, లైక్‌లను వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ దృశ్యం చాలా అందంగా ఉందని ఒకరు రాస్తే.. అదే సమయంలో పక్షులకు ‘హాయ్’ చెప్పడానికి తిమింగలం నీటి నుంచి బయటకు వచ్చిందని మరొకరు కామెంట్ చేశారు.