Mystery disease : సూడాన్ లో వింత వ్యాధితో 100మంది మృతి..

60 ఏళ్లుగా ఎన్నడూ లేనంత వరదలతో సూడాన్ దేశం అల్లాడిపోయింది. ఈక్రమంలో మరో కష్టంతో తల్లడిల్లుతోంది. వింత వ్యాధితో ఇప్పటికే 100మంది చనిపోయారు.

Mystery disease..100 dead in  sudan: ఆఫ్రికా దేశమైన సూడాన్ లో వింత వ్యాధితో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికే అంతు చిక్కని వింత వ్యాధి సోకి 100మంది చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది. సూడాన్ కు నిపుణులను పంపించింది. వారి నమూనాలు సేకరించి వింత వ్యాధి గురించి తెలుసుకునే యత్నాలు చేస్తోంది. కరోనా వైరస్ వచ్చినప్పటినుంచి రోజుకో రకమైన వైరస్ లు వెలుగులోకివస్తున్నాయి. కరోనాలో కొత్త కొత్త వేరియంట్లే కాకుండా వింత వ్యాధులతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో సూడాన్ లో వింత వ్యాధి కలవర పెడుతోంది. ఇప్పటికే 100మందని పొట్టనపెట్టుకుంది.

Read more : Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసి.. ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఈక్రమంలో సౌత్ సూడాన్‌లో ఓ మిస్టరీ వ్యాధి ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ మిస్టరీ వ్యాధితో దక్షిణ సూడాన్‌లో దాదాపు 100 మంది మరణించారని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన పరిశోధన ప్రకటించింది. దీంతో సూడాన్ లో ఆరోగ్య పరిస్థితిపై నివేదిక తయారు చేయడానికి వ్యాధిగ్రస్తుల నుంచి నమూనాలను సేకరించడానికి WHO జోంగ్లీ రాష్ట్రానికి తమ బృందాన్ని పంపింది.

సూడాన్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు వెల్లువెత్తాయి.జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మలేరియాతో పాటు వింత వింత వ్యాధులు విజృంభించాయి. ఇప్పటికే ఆహార కొరతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వరదలు పులిమీద పుట్రలా వచ్చిపడ్డాయి. తాగే నీళ్లు క‌లుషితమయ్యాయి. దీంతో జోంగ్లీలోని ఫంగ‌క్ అనే న‌గ‌రంలో 100మందికి పైగా మరణించినట్లు సౌత్ సుడాన్ మంత్రి కుగ్వాంగ్ ప్రకటించారు.

Read more : Sheena Bora : షీనా బోరా బతికే ఉంది..తల్లి ఇంద్రాణి ముఖర్జియా సంచలన లేఖ

వీరి మృతికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో వైద్యాధికారులు బిజీ బిజీగా ఉన్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే ఇంతమంది మరణించటంతో అధికారులు ఆందోళనలకు గురి అవుతున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి గల కారణం గురించి అన్వేషించేపనిలో పడ్డారు. వాతావ‌ర‌ణ కాలుష్యమే ఈ వింత వ్యాధులకు కారణమైందా? లేదా మరో కొత్త వైరస్సా? అని శాస్త్రజ్ఞులు పరిశోధనలు మొదలు పెట్టారు. స్థానిక పరిస్థితి పై స్థానిక స్వచ్ఛంద సంస్థ ఎంఎస్ఎఫ్ తీవ్ర ఆందోళ‌న వ్యక్తం చేస్తోంది.

దక్షిణ సూడాన్‌లో వరదలు 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణంగా ఉన్నాయని..ఈ వరదలకు 35,000 మంది నిరాశ్రయులైయ్యారని..మరో 835,000 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అసలే పేద దేశం దీనికి తోడు వరదలు. దీంతో పోషకాహార లోపం అధికమైందని పేర్కొంది. ఇటువంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పిల్లల సంఖ్య భారీగా పెరిగిందని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ మెడెసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ వెల్లడించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు