Philippine floods : ఫిలిప్పీన్స్‌‌ని ముంచెత్తుతున్న వరదలు.. 13 మంది మృతి,24మంది గల్లంతు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఓ పక్క చైనా కోవిడ్ వేరియంట్లతో పోరాడుతుంటే..మరోపక్క అమెరికా ప్రకృతిపరంగా ‘బాంబు తుఫాను’నుతో గడ్డకట్టి గజగజలాడిపోతోంది. ఈ దేశాల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ఫిలిప్పీన్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. దీంతో వరదలు వెల్లువెత్తుతున్నాయి. ఈవరదల ధాటికి ఇప్పటికే 13 మంది మృతి చెందారు. మరో 23మంది గల్లంతు అయ్యారు.వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Philippine floods

Philippine floods : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఓ పక్క చైనా కోవిడ్ వేరియంట్లతో పోరాడుతుంటే..మరోపక్క అమెరికా ప్రకృతిపరంగా ‘బాంబు తుఫాను’నుతో గడ్డకట్టి గజగజలాడిపోతోంది. ఈ దేశాల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ఫిలిప్పీన్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. దీంతో వరదలు వెల్లువెత్తుతున్నాయి. ఈవరదల ధాటికి ఇప్పటికే 13 మంది మృతి చెందారు. మరో 23మంది గల్లంతు అయ్యారు.వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

వరదలతో అతలాకుతలం అవుతున్న ఫిలిప్పీన్స్‌ ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వరదలు పోటెత్తుతున్నాయి. జోరు వానలకు వరదలు పోటెత్తడంతో 13 మంది మరణించారు.. 23 మంది గల్లంతయ్యారు. 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితుల కోసం పురావాసన కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారిని అక్కడికి తరలిస్తోంది.

భారీ వర్షాలు కొట్టి కురుస్తుండటంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు వరదల ధాటికి కొట్టుకుపోవటంతో రవాణా సదుపాయలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. దీంతో ప్రజలు అంధకారంలోనే జీవిస్తున్నారు. భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.