Food Crisis : భవిష్యత్‌లో తినడానికి తిండి కూడా దొరకదట.. వ్యవసాయ భూములు ఉండవట..!

శీతోష్ణస్థితి సంక్షోభం, వాతావరణ మార్పులు, వరదలు, కరువులు వంటి పరిస్థితులు మన భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

food crisis : ప్రపంచ దేశాల ప్రజలకు శాస్త్రవేత్తలు పిడుగులాంటి వార్త చెప్పారు. భవిష్యత్‌లో తినడానికి తిండి కూడా దొరకదని రిపోర్ట్ ఇచ్చారు. పంట పండించేందుకు వ్యవసాయ భూములు ఉండవన్నారు. రానున్న 27 ఏళ్లలోనే ఇదంతా జరగుతుందని కొందరు సైంటిస్టులు కుండబద్దలు కొడుతున్నారు. 2050 నాటికి భూమ్మీద ఉన్న మనిషికి తిండికి దిక్కుండదంటున్నారు.

శీతోష్ణస్థితి సంక్షోభం, వాతావరణ మార్పులు, వరదలు, కరువులు వంటి పరిస్థితులు మన భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేవలం రెండు దశాబ్దాలలో గుప్పెడు మెతుకులు కూడా దొరకక ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆకలితో అల్లాడిపోతారని డూమ్స్‌డే కౌంట్‌డౌన్ ప్రకారం వార్నింగ్ ఇచ్చారు.

Severe Heatwave: వేడి నుంచి అతి వేడిగా మారనున్న వాతావరణం: వాతావరణశాఖ హెచ్చరిక

బులెటిన్ సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డ్ శాస్త్రవేత్తలు ఈ డూమ్స్‌డే కౌంట్‌డౌన్‌ను అంచనా వేస్తారు. దీని ప్రకారం, ఆహార కొరతకు సంబంధించి ఏప్రిల్ 24 ఆదివారం నుంచి సరిగ్గా 27 సంవత్సరాల 251 రోజులు మిగిలి ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. 2017లో మనకు అవసరమైన దానితో పోలిస్తే ఆహార డిమాండ్ 70 శాతం పెరిగిందని సైంటిస్టులు చెప్తున్నారు.

భూమి గరిష్టంగా వెయ్యి కోట్ల జనాభాకు ఆహారం ఇవ్వగలదు అని సైంటిస్టులు అంటున్నారు. ప్రతిరోజూ అధిక మొత్తంలో వృథా అవుతున్న ఆహారాన్ని కూడా సైంటిస్టులు ప్రస్తావిస్తున్నారు. అయితే గత 8 వేల సంవత్సరాలలో ఉత్పత్తి చేసిన దానికంటే రాబోయే 40 ఏళ్లలో మనం ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉందని గణాంకాలు చెప్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు