Strange gift from father : కూతురికి బహుమతిగా మురికినీటి బాటిల్.. తండ్రి ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్..

పుట్టినరోజు నాడు పేరెంట్స్ పిల్లలు అడిగే వస్తువుల్ని బహుమతిగా ఇస్తారు. కూతురి బర్త్ డేకి ఓ తండ్రి ఇచ్చిన బహుమతి ఏంటో తెలిస్తే షాకవుతారు.

Strange gift from father

Strange gift from father : కూతురి బర్త్ డే అంటే తండ్రి ఖచ్చితంగా విలువైన బహుమతి ఇస్తాడు. కానీ ఓ తండ్రి తన కూతురికి మురికి నీరు నిండిన బాటిల్‌ను బహుమతిగా ఇచ్చాడు. షాకింగ్‌గా అనిపిస్తోందా? కారణం ఏమై ఉంటుంది?

laziest citizen contest : నిలబడకూడదు.. కూర్చోకూడదు.. లేజియెస్ట్ సిటిజన్ పోటీ.. ఎక్కడంటే?

ప్యాట్రిసియా మౌ (@patriciamou_) అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన పుట్టినరోజుకి తండ్రి ‘డర్టీ బాటిల్ ఆఫ్ వాటర్’ బహుమతిగా ఇచ్చారంటూ షేర్ చేసింది. గతంలో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్, పెప్పర్ స్ప్రే, ఎన్ సైక్లోపీడియా, కీ చైన్, తను రాసిన పుస్తకాన్ని అంకితం చేయడం వంటి బహుమతులు ఇచ్చినట్లు పోస్టులో రాసుకొచ్చింది.

ప్యాట్రిసియా మౌ ఇంకా తన పోస్టులో తండ్రి ఇచ్చిన గిఫ్ట్ గురించి వివరంగా రాసుకొచ్చింది. ఈ సంవత్సరం తన తండ్రి ఇచ్చిన బహుమతి ఎంతో విలువైనదని చెప్పింది.  ఎందుకంటే దానిని డబ్బుతో కొనలేమని ఒక గొప్ప జీవిత పాఠమని రాసింది. మన జీవితం గందరగోళంగా ఉన్న పరిస్థితిని కదిలిన మురికినీటి సీసా సూచిస్తుందట.. అదే మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు సీసాలో ఉన్న 10%  మట్టి కిందకు చేరి స్వచ్ఛమైన నీరు పైన తేలుతుందట. ఇంత లోతైన అర్ధం ఉందన్నమాట.

New Son in law Procession: కొత్త అల్లుడ్ని గాడిదపై ఊరేగించిన గ్రామస్తులు.. వీడియో వైరల్

వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌కి ‘ఇది పుట్టినరోజు నాడు మీరు కోరుకునే బహుమతి కాకపోవచ్చు.. కానీ జీవితకాలం పాటు గుర్తు పెట్టుకోవాల్సిన బహుమతి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. మొత్తానికి ఈ బహుమతి వింతగా ఉన్నా లోతైన భావాన్ని చెబుతోంది.