Shooting in Georgia : జార్జియాలో కాల్పులు..నలుగురి మృతి

జార్జియా దేశంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అట్లాంటాకు దక్షిణాన ఉన్న జార్జియా దేశ సబర్బన్ ప్రాంతంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ మరణించారు....

Shooting in Georgia

Shooting in Georgia : జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అట్లాంటాకు దక్షిణాన ఉన్న జార్జియా  సబర్బన్ ప్రాంతంలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం జార్జియా పోలీసులు గాలిస్తున్నారు. 8,500 మంది జనాభా ఉన్న హాంప్టన్ లో కాల్పులు జరిగాయి. (Four people killed in Shooting in Georgia)

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

ఈ కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం డిటెక్టివ్ లు గాలిస్తున్నారు. అధికారులు మృతుల పేర్లను వెల్లడించలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ చెప్పిన వారికి తాము 10వేల డాలర్ల బహుమతి ఇస్తామని హెన్రీ కౌంటీ షెరీఫ్ రెజినాల్డ్ స్కాండ్రెట్ ప్రకటించారు. అట్లాంటా ప్రాంతంలోని చట్ట అమలు సంస్థలు, జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాన్‌హాంట్ కాల్పులు జరిపిన వ్యక్తి దర్యాప్తులో సహాయం చేస్తున్నాయి.