Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

Heavy Rainfall

Heavy Rainfall : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. (IMD Predicts Extremely Heavy Rainfall) మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం తెలిపింది.

Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. (Issues Orange Alert For 5 States) మరో 5 రోజుల పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

PM Modi UAE Visit : ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ..ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడి వెజ్ విందు

జులై 19వతేదీన గుజరాత్‌ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జులై 17వతేదీన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ మధ్యప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

PM Modi lands in Delhi : ముగిసిన యూఏఈ, ఫ్రాన్స్ దేశాల పర్యటన…ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీ

కోస్తా కర్ణాటక ప్రాంతంలో జులై 19 వతేదీ వరకు, కర్ణాటక ప్రాంతంలో జులై 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులై 18, 19 తేదీల్లో తెలంగాణ, కేరళ, మహారాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాబోయే 4 రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయి. రానున్న రెండు రోజుల్లో ఈశాన్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జులై 16వతేదీన ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.