Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలు వరదల్లో మునిగిపోయారు. నలుగురు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కథువాలో వరదలో చిక్కుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు....

Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

Flash Floods in Jammu and Kashmir

Flash Floods in Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్‌లో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలు వరదల్లో మునిగిపోయారు. నలుగురు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కథువాలో వరదలో చిక్కుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. (Two girls on way home from school drown ) బాలికలు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొండ వాగును దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయారు.

PM Modi lands in Delhi : ముగిసిన యూఏఈ, ఫ్రాన్స్ దేశాల పర్యటన…ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీ

నలుగురు బాలికలు నంగల-మచడ్డి ప్రాంతంలో పాఠశాలకు వెళ్లి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సహాయ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఇద్దరు బాలికలను రక్షించగా, మరో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మోనికా దేవి, రాధాదేవిగా గుర్తించారు. మృతులిద్దరూ 6వ తరగతి విద్యార్థులు. వరద విపత్తు నుంచి బయటపడిన బాలికలను బిల్లవార్ ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు.

NDA Meeting : కీలక పరిణామం.. ఎన్డీయే భేటీకి జనసేనకు ఆహ్వానం

ప్రతికూల వాతావరణంలో పిల్లలను బయటకు వెళ్లనివ్వవద్దని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తల్లిదండ్రులకు సూచించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘కథువాలో సంభవించిన విషాద వరద సంఘటనలో విలువైన యువకుల ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించాను’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.