PM Modi UAE Visit : ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ..ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడి వెజ్ విందు

అబుదాబీలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ విందు ఇచ్చారు. ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు వెజ్ విందులో ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ మెనూలో ఉన్నాయి....

PM Modi UAE Visit : ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ..ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడి వెజ్ విందు

PM Modi UAE Menu

Updated On : July 16, 2023 / 6:30 AM IST

PM Modi UAE Visit : అబుదాబీలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ విందు ఇచ్చారు. ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు వెజ్ విందులో ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ మెనూలో ఉన్నాయి. పీఎం మోదీకి ఏర్పాటు చేసిన విందులో పాలు లేదా గుడ్డు ఉత్పత్తులు లేకుండా పూర్తి శాఖాహార భోజనం అందించారు. ఖర్జూర సలాడ్, మసాలా సాస్‌లో కాల్చిన కూరగాయలు, క్యారెట్ తందూరీని మోదీకి వడ్డించారు. (Dates salad, carrot tandoori on menu)

PM Modi lands in Delhi : ముగిసిన యూఏఈ, ఫ్రాన్స్ దేశాల పర్యటన…ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీ

శనివారం అబుదాబిలోని కస్ర్-అల్-వతన్ అధ్యక్ష భవనంలో విందు జరిగింది. (UAE President hosts veg banquet for PM Modi) స్థానిక సేంద్రీయ కూరగాయలతో తయారు చేసిన హారీస్ (గోధుమలు), ఖర్జూరం సలాడ్ అందించారు. మసాలా సాస్‌లో కాల్చిన కూరగాయలు స్టార్టర్‌లుగా ఇచ్చారు. ప్రధాన కోర్సు కోసం ప్రముఖులకు కాలీఫ్లవర్, క్యారెట్ తందూరితో పాటు నల్ల పప్పు, స్థానిక హరీస్ వడ్డించారు.

Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

డెజర్ట్ కోసం ఈ విందులో స్థానిక పండ్లను అందించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం అబుదాబిలో పర్యటించారు. మోదీకి వడ్డించిన కూరలన్నీ కూరగాయల నూనెతో తయారు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలను ప్రధాని మోదీకి అబుదాబిలో యూఏఈ అధ్యక్షుడు వడ్డించారు. శనివారం రాత్రి డిన్నర్ అనంతరం మోదీ యూఏఈ పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరిగివచ్చారు.