Dinosaur Bones : చైనాకు డైనోసార్ ఎముకల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్ .. వాటి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

చైనాకు డైనోసార్ ఎముకల్ని అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్లుగా పురాతన వస్తువుల్ని అమ్ముతున్న నలుగురుని అరెస్ట్ చేశారు.

Dinosaur Bones Sales

Dinosaur Bones Sales : దాదాపు రూ.8కోట్ల విలువైన డైనోసార్ ఎముకల్ని అమ్ముతున్న నలుగురుని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఐదేళ్లుగా ఒక ముఠా డైనోసార్ ఎముకలతో సహా పాలియోంటాలాజికల్ వనరులను చైనాకు అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో ఇద్దరు ఉటాకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు 65 ఏళ్ల వింట్ వేడ్, 67 ఏళ్ల డోనా వేడ్ లుగా గుర్తించారు.మరో ఇద్దరు తండ్రీ కొడుకులు లాస్ ఏంజెల్స్ కు చెందిన 67 ఏళ్ల స్టీవెన్ విల్లింగ్,40 ఏళ్ల జోర్ధాన్ విల్లింగ్ లుగా గుర్తించారు.

పాలియోంటాలాజికల్ రిసోర్సెస్ ప్రిజర్వేషన్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తు అనేక నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. పురాతన వనరులను కొని వాటిని వేరొకరికి అమ్ముతున్నారని తేలింది. వీటిలో 150,000 పౌండ్ల విలువైన డైనోసార్ ఎముకలు ఉన్నాయని తెలిపారు.

ఐదేళ్లలో డైనోసార్ ఎముకలను కొని చైనాకు అమ్ముతున్నారని న్యాయవాదులు వెల్లడించారు. వీటితో పాటు అనేక విలువైన ఖనిజాలు, పురాతన వస్తువులను సేకరించి..తండ్రీ కొడుకులు జోర్డాన్, స్టీవెన్ విల్లింగ్‌లకు పాలియోంటాలాజికల్ మెటీరియల్‌లను కూడా అమ్మారని పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు