Donald Trump ahead of Kamala Harris by 2 points nationally ( Image Source : Google )
US Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేవలం 18 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల కోసం హోరాహోరీగా పోటీ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా? లేదా కమలా హారిస్ గెలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్ 5న అమెరికా ఎన్నికల జరుగున్న నేపథ్యంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అనేదానిపై అనేక సర్వేలు నిర్వహిస్తున్నాయి.
తాజాగా ఫాక్స్ న్యూస్ జాతీయ సర్వే ప్రకారం.. అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అధ్యక్ష పోటీలో కమలా హారిస్ (48శాతం) కన్నా ట్రంప్ (50 శాతం) ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇతర సర్వేలను పరిశీలిస్తే.. గత నెలలో హారిస్‌కు స్వల్ప ప్రయోజనాన్ని కలిగి ఉన్నప్పటి తాజాగా సర్వేలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
అయితే, ఏడు కీలకమైన రాష్ట్రాల ఓటర్లలో హారిస్ 6 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థులు దగ్గరి కౌంటీలలోని ఓటర్లలో ఒక్కొక్కరు 49శాతం (బైడెన్-ట్రంప్ 2020 మార్జిన్ 10 పాయింట్ల కన్నా తక్కువ)తో సమానంగా ఉన్నారు. 2020లో బైడెన్ 10 పాయింట్లకు పైగా (58శాతం-39శాతం) గెలుపొందిన కౌంటీలలో హారిస్ సాధించిన దానికంటే 2020లో 10 పాయింట్ల (64శాతం-35శాతం) కన్నా ఎక్కువ తేడాతో గెలుపొందిన కౌంటీల్లో ట్రంప్‌కు ఎక్కువగా ఆధిక్యాన్ని సంపాదించారు.
ఓటర్లలో, కాలేజీ గ్రాడ్యుయేట్లు, మహిళలు, నల్లజాతి ఓటర్లు, హిస్పానిక్ అమెరికన్ ఓటర్లలో హారిస్ ముందంజలో ఉంటే.. నాన్-కాలేజీ గ్రాడ్యుయేట్లు, పురుషులు, శ్వేతజాతీయుల అమెరికన్ ఓటర్లలో ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అక్టోబర్ 11 అక్టోబర్ 14 మధ్య నిర్వహించిన పోల్ సర్వేలో పాల్గొన్న వారిలో 1,110 మంది ఓటర్లు, 870 మంది ఓటర్లు ఉన్నారు. ట్రంప్ ఇప్పుడు 2 పాయింట్లతో ముందంజలో ఉన్నారు.
గత నెలలో హారిస్ 2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో 4 పాయింట్లతో ట్రంప్ దూసుకెళ్లారు. గత నెలలో కన్నా శ్వేతజాతీయుల నుంచి ఇప్పుడు 10 పాయింట్లు మద్దతు పెరగడంతో ట్రంప్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. 65ఏళ్ల వయస్సులో అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లు (49శాతం), కాలేజీ డిగ్రీ (48శాతం) ఉన్నవారిలో రికార్డు స్థాయిలో మద్దతు లభించింది.
అధ్యక్ష పదవి రేసులో గెలిచేందుకు అవసరమైన కీలకమైన 270 ఎలక్టోరల్ ఓట్ల కోసం ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రతి ఒక్కరూ 200 ఎలక్టోరల్ ఓట్లను పొందగల బలమైన స్థానాల్లో గట్టి పోటీని ఇస్తున్నారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికల సమయానికి రేసులో మార్పులు ఉండవచ్చు.
Read Also : Sheikh Hasina : షేక్ హసీనాను వెంటనే అరెస్ట్ చేయండి.. మాజీ ప్రధానిపై వారెంట్ జారీ చేసిన బంగ్లాదేశ్ కోర్టు!