Covid-19: అక్కడ కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త

విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

Covid-19: విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఫ్రాన్స్ లో కొద్ది రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులు ఒక్క రోజే 50వేలకు పైగా కనిపిస్తున్నాయి. ఈ కేసుల సంఖ్య దాదాపు రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అలైన్ ఫిషర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. కరోనా కొత్త వేవ్ ను ఎదుర్కొంటున్నామని, దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులను బట్టి చూస్తుంటే అందులో సందేహమే లేదని వ్యాఖ్యానించారు.

కొత్త వేవ్ తీవ్రం ఎంతవరకూ ఉంటుందనేది చెప్పలేమని, దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కనీస జాగ్రత్తలైన మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.

Read Also: తెలంగాణలో పెరిగిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..

గత నెల చివరివారం ఫ్రాన్స్ లో నమోదైన కేసులు మూడు రెట్లు పెరిగాయి. మే 27న 17వేల 705గా ఉండగా, మంగళవారం 50వేల 402కు చేరుకున్నాయి. అదే విధంగా యూరిపియన్ దేశాలైన పోర్చుగల్ లోనూ అదే పరిస్థితి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల బీఏ4, బీఏ5 వ్యాప్తి వేగంగా ఉండటమే దీనికి కారణం.

ట్రెండింగ్ వార్తలు