Ts covid-19: తెలంగాణలో పెరిగిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రోజురోజుకు చాపకింద నీరులా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.

Ts covid-19: తెలంగాణలో పెరిగిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Covid19

Ts covid-19: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రోజురోజుకు చాపకింద నీరులా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. శనివారం మొత్తం 24,686 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించారు. అయితే రాష్ట్రంలో కొవిడ్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3,53,00,795 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇదిలాఉంటే శుక్రవారంతో పోల్చుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,95,819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 116 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చికిత్స పొందుతూ కోలుకున్న వారి సంఖ్య 7,89,796కు చేరింది. మరణాలేమీ నమోదు కాలేదు. ఇక రికవరీ రేటు 99.24శాతంగా ఉంది.

Joe Biden: సైకిల్ తొక్కుతూ కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. వీడియో వైరల్..

తెలంగాణలో 1,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కొవిడ్ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందని, ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.