Basara IIT: ఇది మీ ప్రభుత్వం.. ఆందోళన విరమించండి.. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ..

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులను కోరారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారు.

Basara IIT: ఇది మీ ప్రభుత్వం.. ఆందోళన విరమించండి.. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ..

Sabitha Indra Reddy

Basara IIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన శనివారం ఐదోరోజు కొనసాగింది. అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తమ విద్యా సంస్థను సందర్శించాలని, తద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇదిలాఉంటే విద్యార్థుల సమస్యలను పరిష్కరించే క్రమంలో మరోసారి అధికారులు చర్చలకు ఆహ్వానించారు. శనివారం సాయంత్రం సమయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. అయితే ఈ చర్చల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గోనున్నట్లు తెలుస్తోంది.

IIIT BASARA: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదో రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులను కోరారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారనే నా ఆవేదన అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం మీ మంత్రిగానే కాదు, ఒక అమ్మగా బాధేస్తుంది. ఇది మీ ప్రభుత్వం, దయచేసి చర్చించండి, ఆందోళనను విరమించండి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ ను నియమించామని తెలిపారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరణను ప్రభుత్వం మీ వద్దకు పంపించిందని, ఇది మీ ప్రభుత్వం.. దయచేసి సమస్యలపై సానుకూలంగా చర్చించి పరిష్కరించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి లేఖలో విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.