Corona Virus : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది నవంబర్ చివరి వరకు కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. డిసెంబర్ నెల మొదటి వారంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రారంభమైంది

Corona Virus

Corona Virus : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది నవంబర్ చివరి వరకు కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. డిసెంబర్ నెల మొదటి వారంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రారంభమైంది. దీంతో కేసుల సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఫ్రాన్స్, అమెరికా, యూకేలలో లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ ప్రభావం ఈ మూడు దేశాల్లో అధికంగా ఉంది. ఇక ఈ దేశాల్లో ఒమిక్రాన్ తో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

చదవండి : Covid in France: కరోనా విలయతాండవం.. వరుసగా నాలుగో రోజు 2లక్షలకు పైగా కేసులు

ఇక ఇదెలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఫ్రాన్స్‌లో నమోదవుతున్నాయి. ఆరున్నర కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. శనివారం ఒక్కరోజే 2,19,126 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 110 మంది కరోనాతో మృతి చెందారు. అయితే ఇక్కడ 75 శాతం కంటే ఎక్కువగానే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ జరిగినా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది.

చదవండి : Coronavirus France : ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో 2 లక్షలకు చేరిన కొత్త రోజువారీ కేసులు

ఫ్రాన్స్‌లో కరోనా బారినపడుతున్న వారిలో 75 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.