France
Covid in France: ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రాన్స్‌లో కోవిడ్-19 సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి 10 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదైన దేశాల్లో ప్రపంచంలో ఫ్రాన్స్ ఆరవ దేశంగా అవతరించింది.
ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు 24 గంటల వ్యవధిలో 219,126 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించారు. దేశంలో వరుసగా నాలుగో రోజు 200,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
ప్రమాదకరంగా మారిన ఫ్రాన్స్‌లో కరోనా ముప్పు:
కరోనా సంక్రమణ విషయంలో, 10 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదైన అమెరికా, ఇండియా, బ్రెజిల్, బ్రిటన్ మరియు రష్యా వంటి దేశాల జాబితాలో ఫ్రాన్స్ చేరుకుంది. ఫ్రాన్స్‌లో శనివారం ఒక్కరోజే గరిష్టంగా 232,200 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పరంగా రాబోయే కొద్ది వారాలు చాలా ప్రమాదంగా ఉంటాయపి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రజలను హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లోని ఫేస్ మాస్క్‌లు మస్ట్..
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నూతన సంవత్సరం ప్రారంభమైన వేళ.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేయదని.. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం మాత్రం మస్ట్ అని ప్రకటించారు.
పారిస్, లియోన్‌తో సహా కొన్ని ప్రధాన నగరాల్లో మాస్క్‌లు ధరించడాన్ని మళ్లీ అమలు చేశాయి. దేశంలో COVID-19 మరణాల సంఖ్య 24 గంటల్లో 110 పెరగ్గా 123,851కి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 12వ అత్యధికం.