Playboy Controversy: ప్లేబాయ్‌కు ఫ్రాన్ మహిళా మంత్రి పోజులు.. రాజకీయ రచ్చ

"అటువంటి" ఫొటోలకు మహిళా మంత్రి పోజులు ఇవ్వడం ఏంటని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్లేబాయ్ (Playboy) మ్యాగజైన్ పై కూడా ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి.

"Playboy" Controversy

Playboy Controversy: పురుషుల మ్యాగజైన్ ప్లేబాయ్ (Playboy)కు ఫ్రాన్ మహిళా మంత్రి పోజులు ఇవ్వడంతో ఆమెపై సొంత ప్రభుత్వ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆమె ఫొటోనే “ప్లేబాయ్” తాజాగా ముఖ చిత్రంగా ప్రచురించింది. ప్లేబాయ్ ప్రముఖ మోడళ్ల అశ్లీల చిత్రాలను కూడా ప్రచురిస్తుంటుంది. ఈ మ్యాగజైన్ 1953లో ప్రారంభమైంది. అప్పట్లో లైంగిక స్వేచ్ఛ, విప్లవానికి కారణమైంది.

ఆ మ్యాగజైన్ పై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా, ఫ్రాన్ మహిళా మంత్రి, స్త్రీవాద రచయిత్రి మార్లిన్ షియప్ప (40) (Marlene Schiappa) ఫొటో “ప్లేబాయ్” ముఖచిత్రంపై దర్శనం ఇచ్చింది. ఇలా ప్లేబాయ్ కోసం పోజులు ఇవ్వడం కూడా స్త్రీవాద ధోరణేనా? అంటూ చాలా మంది ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. సంప్రదాయవాదులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి మార్లిన్ షియప్ప అవుననే సమాధానం చెబుతున్నారు. నిజానికి, మార్లిన్ షియప్పకు వివాదాలు కొత్తేం కాదు.

గతంలోనూ పలుసార్లు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా, ఆమె “ప్లేబాయ్” కోసం ఫొటోలకు పోజులు, మహిళలు, గేల హక్కులు, అబార్షన్ పై 12 పేజీల ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా తప్పుబడుతున్నారు. దీంతో దీనిపై మార్లిన్ షియప్ప స్పందించారు. “మహిళలు తమ హక్కులను స్వేచ్ఛగా వాడుకునే క్రమంలో వారు తమ దేహాలతో ఏ సమయంలోనైనా, ఎక్కడైనా సరే ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకోనివ్వండి” అని సమాధానం ఇచ్చారు.

కొందరు తిరోగమనవాదులకు బాధకలిగినా ఫ్రాన్సులో మహిళలు స్వేచ్ఛగా జీవించగలరని ఘాటుగా చెప్పారు. తమకున్న స్వేచ్ఛను హాయిగా అనుభవించే హక్కు మహిళలకు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ కూడా మార్లిన్ షియప్ప తీరు సరికాదని అన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఈ తీరుతో వ్యవహరించడం సరికాదని చెప్పారు.

పదవీ విరమణ వయసును 62 నుంచి 64కి పెంచాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రణాళికలు వేసుకోవడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా, మార్లిన్ షియప్ప తీరుపై ఎంపీ సాండ్రిన్ గ్రూసొ స్పందిస్తూ… మహిళలు తమ దేహాలను ఎక్కడైనా ప్రదర్శించవచ్చని అందులో తనకు ఎలాంటి సమస్యా లేదని, కానీ, అందుకు సామాజిక సందర్భం అనేది ఒకటి ఉంటుందని చెప్పారు.

Janhvi Kapoor : అతడితో జాన్వీ ప్రేమాయణం నిజమేనా.. తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న ఇద్దరు..