Cars
Cars set Ablaze: ప్రపంచంలో ఉన్న ఒక్కో దేశంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఆయా సాంప్రదాయాలను పాటిస్తుంటారు ప్రజలు. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఫ్రాన్స్ దేశంలో ప్రజలు తమ సాంప్రదాయంలో భాగంగా కార్లను దహనం చేసారు. అవును మీరు విన్నది నిజమే. ఇళ్లలో ఉన్న పాత కార్లను ఒక చోటికి చేర్చి వాటిని ఏకమొత్తంగా తగలబెట్టారు. వినడానికి వింతగా ఉన్న ఈ ఆచారం ఫ్రాన్స్ కు ఈశాన్యంగా ఉన్న “స్ట్రాస్‌బర్గ్” అనే ప్రాంతంలో 90వ దశకం నుంచి పాటిస్తున్నారట. అప్పట్లో ఒక తిరుగుబాటు సందర్భంగా కొందరు ఆకతాయిలు చేపట్టిన ఈకార్ల దహనం… కొన్ని కారణాల వలన ఇప్పటికి కొనసాగుతుంది. ఇక 2022 కొత్త సంవత్సరం సందర్భంగా సుమారు 874 కార్లను, మరికొన్ని చెత్తబుట్టలను అక్కడి వారు తగలబెట్టారు. కరోనా తీవ్రత కారణంగా ఈకార్ల సంఖ్య అంతక్రితం కంటే తగ్గిందంట. 2019 కొత్త సంవత్సరం సందర్భంగా 1316 కార్లను స్ట్రాస్‌బర్గ్ వాసులు తగలబెట్టగా, అత్యధికంగా 2005లో 9000 కార్లను దహనం చేసారు స్థానికులు.
Read: WHO Chief about Covid: కోవిడ్ అంతమయ్యేది అప్పుడే: WHO చీఫ్
ఇదేం సాంప్రదాయం రా బాబు అనుకుంటున్నారా!. స్థానికులు ఈ సాంప్రదాయాన్ని పాటించడానికి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. నేరపూరిత చర్యలను కప్పి పుచ్చుకునేందుకు, తప్పుడు బీమా క్లెయిమ్‌లను సమర్ధించుకునేందుకు కొందరు తమ కార్లను ఇలా దహనం చేస్తూ.. వాటిని ఆకతాయిల చర్యగా ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని నిషేదించింది. ఇకపై కొనసాగకుండా చర్యలు తీసుకోవాలంటూ గతంలో పోలీసులకు సూచించింది. పోలీసులు
Also read: Fire Accident: తగలబడ్డ థియేటర్.. నిర్లక్ష్యమే కారణమా..!
ఈతతంగాన్ని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసేవారు. అయితే పోలీసుల కళ్లుగప్పి కార్లను దహనం చేసేవారు స్ట్రాస్‌బర్గ్ వాసులు. 2022లో తలపెట్టిన “కారు దహనం” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులు రాకను గమనించిన స్థానికులు కార్లను తగలబెట్టి సరదా తీర్చుకున్నారు. మంటలు అదుపుచేసేందుకు వెళ్లిన నలుగురు పోలీసు సిబ్బంది గాయాలపాలైయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసు అధికారులు.. 440 మందిపై కేసులు నమోదు చేసారు. ఏదిఏమైనా తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని స్ట్రాస్‌బర్గ్ వాసులు చెబుతున్నారు.
Also Read: Brahmamgari Matam: మళ్లీ మొదటికే బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం