“Jimmy, Jimmy” Song viral In China : చైనాను షేక్ చేస్తున్న బాలీవుడ్ “జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా” సాంగ్..

చైనాలో మన బాలీవుడ్ పాట మారుమోగుతోంది. కోవిడ్ ప్రస్టేషన్ లో ఉన్న చైనీయులు మన బాలివుడ్ పాటలతో తమ నిరసనలను వెళ్లగ్రక్కుతున్నారు. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా డిస్కో డ్యాన్సర్‌లోని పాట.. చైనాను ఊపేస్తుంది. కోవిడ్ కేసులు నమోదు కొనసాగుతున్న చైనాలో ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీతో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్న క్రమంలో "జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా" చైనా షార్ట్ యాప్‌లను షేక్ చేస్తోంది.

1982 movie "Disco Dancer" Bappi Lahiri Hit song "Jimmy, Jimmy"  In China To Protest Covid Lockdowns

“Jimmy, Jimmy” Song viral In China : చైనాలో మన బాలీవుడ్ పాట మారుమోగుతోంది. కోవిడ్ ప్రస్టేషన్ లో ఉన్న చైనీయులు మన బాలివుడ్ పాటలతో తమ నిరసనలను వెళ్లగ్రక్కుతున్నారు. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా డిస్కో డ్యాన్సర్‌లోని పాట.. చైనాను ఊపేస్తుంది. చైనాలో ఏంటీ మన బాలివుడ్ సాంగేంటీ వైరల్ కావటం వెనుక ఉండటానికి ప్రపంచాన్ని గడగడలాండించి కోవిడ్ కారణంగా ఉంది. కోవిడ్ మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా ఇప్పటికే కోవిడ్ ప్రకంపనలు సృష్టిస్తునే ఉంది. చైనా పుట్టి మొత్తం ప్రపంచ దేశాల్ని చుట్టేసిన కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలన్ని కోలుకున్నాయి. కానీ చైనాలో మాత్రం మరోసారి మహమ్మారి తన ప్రతాపాన్నిచూపిస్తోంది. లాక్ డౌన్ విధించినా కేసులు కొనసాగుతున్నాయి. కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కోవిడ్ కట్టడికి చైనా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కొన్ని ప్రాంతాల్లో లాడ్ డౌన్ లు కొనసాగించాల్సి వస్తోంది.ఈక్రమంలో లాక్ డౌన్ పేరు చెబితేనే హడలిపోయే చైనా ప్రజలు ప్రస్టేషన్ కు గురి అవుతున్నారు.

చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న జీరో కోవిడ్ పాలసీ చైనీయులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వైరస్ తగ్గిందనుకునేలోపు మరో వేరియంట్ పుట్టుకొచ్చి విజృంబిస్తుంది. దీంతో మహమ్మారి కథ తిరిగి మొదటికొస్తోంది. ప్రజల ప్రస్టేషన్ ను పట్టించుకోకుండా ప్రభుత్వం ఆంక్షల్ని కొనసాగిస్తోంది. దీంతో అధికారులు పెట్టే ఆంక్షలకు అక్కడి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. నిబంధనలు అతిక్రమించలేక..అలాగన వాటిని పాటించలేక నరకం అనుభవిస్తున్నారు. కొంతమంది అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరు మానసికంగా కుంగిపోతున్నారు.

దీంతో ప్రభుత్వం పెడుతున్న కరోనా ఆంక్షలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.ఆంక్షలపై ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తాము అనుకున్నదే చేస్తున్నారు. ఈక్రమంలో జాగా మళ్లీ అక్కడ బీజింగ్ వంటి నగరాల్లో లాక్‌డౌన్‌లు పెడుతున్నారు. దాంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. వాళ్ల ఫ్రస్టేషన్ పీక్ స్టేజ్‌కు వెళ్లింది. కొంతమంది సోషల్ మీడియా ద్వారా వారి కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. రకరకాల పాటలతో వాళ్ల అసంతృప్తిని తెలియజేస్తూ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో అక్కడి సోషల్ మీడియాలో మన బాలీవుడ్ సినిమా సాంగ్ హవా కనిపిస్తుంది. 1982లో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా డిస్కో డ్యాన్సర్‌లోని పాట.. ఆ దేశాన్ని ఊపేస్తుంది. ఈ సినిమాలో పాటలను బప్పీలహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అందులో పార్వతి ఖాన్ ఆలపించిన “జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా” ఇప్పుడు చైనా షార్ట్ యాప్‌లను కుదిపేస్తుంది. ఈ బాణిలో వారి అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. అక్కడి కోవిడ్ ఆంక్షలపై, లాక్‌డౌన్‌లపై పాటలతో తన కోపాన్ని ఈ రకంగా తెలియజేస్తున్నారు.