Putin Frustrating: సహచరులు, అధికారులపై పుతిన్ ఆగ్రహం: గతంలో చూడలేదన్న అనుచరులు

సాధారణంగా ఎంతో ఓర్పు, సహనంతో ఉండే పుతిన్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడని..అయితే ఈ విధమైన ఆగ్రహావేశాలు తాము గతంలో ఎన్నడూ చూడలేదని సన్నిహిత వర్గాలు చెప్పాయి

Putin

Putin Frustrating: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం జఠిలమైంది. మంగళవారం ఉదయం నుంచి యుక్రెయిన్ లోని ఒక్కో నగరాన్ని పుతిన్ సేనలు భూస్థాపితం చేస్తున్నాయి. యుక్రెయిన్ లోని ప్రధాన నగరమైన ఖార్కివ్ నగరంలో రష్యా సైనికులు బాంబుల మోతమోగించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాంబు దాడులు చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్ ను కూడా మంగళవారం సాయంత్రానికి లేదా బుధవారం నాటికీ రష్యా సైనికులు భూస్థాపితం చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అసలు ఈ విధ్వంసానికి కారణం పుతిన్ అసహనమే నంటూ అమెరికా నిఘావర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ వార్తా సంస్థ తెలిపిన వివరాలు ప్రకారం.. పాక్షిక దాడులతో యుక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకుందామనుకున్నా పుతిన్ కు.. ఊహించని విధంగా యుక్రెయిన్ సేనల నుంచి ప్రతిఘటన ఎదురైంది.

Also read: Russia Ukraine Crisis : రంగంలోకి బాహుబలి యుధ్ధవిమానం సీ-17

దీంతో కీవ్ నగరాన్ని ఆక్రమించుకునేందుకు తాము అనుకున్న సమయం దాటి..మరింత సమయం పట్టడం, బలగాల మోహరింపు వంటి విషయాలు పుతిన్ కు ఆగ్రహం కలిగించాయి. దీంతో తన అనుచరులు సహా, ఇతర అధికారులపై పుతిన్ విరుచుకుపడినట్లు అమెరికా నిఘావర్గాలు తెలిపాయి. సాధారణంగా ఎంతో ఓర్పు, సహనంతో ఉండే పుతిన్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడని..అయితే ఈ విధమైన ఆగ్రహావేశాలు తాము గతంలో ఎన్నడూ చూడలేదని పుతిన్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు అమెరికా నిఘావర్గాలు తెలిపాయి. లక్షల కొద్ది సైన్యాన్ని మోహరింపజేసి, రోజులు గడుస్తున్నా యుద్ధంలో పురోగతి లేకపోవడంతో సహనం కోల్పోయిన పుతిన్ ఇలా తన చుట్టూ ఉన్నవారిపై ఆగ్రవేశాలు ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.

Also read: Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!