Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!

Ukraine Russia War : యుక్రెయిన్‌పై రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. చర్చలు విఫలం కావడంతో మళ్లీ దాడులకు తెగబడుతోంది రష్యా.. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దండెత్తింది.

Ukraine Russia War : యుక్రెయిన్‌పై వెనక్కి తగ్గని పుతిన్.. ఆ ధైర్యం ఇచ్చింది ఇతడేనట..!

Ukraine Russia War Who Is The Real Hero Behind Putins Aggressive Actions Against Ukraine Invasion

Ukraine Russia War : యుక్రెయిన్‌పై రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. చర్చలు విఫలం కావడంతో మళ్లీ దాడులకు తెగబడుతోంది రష్యా.. ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై దండెత్తి వచ్చిన రష్యా.. తన బలగాలతో 24 గంటల్లోనే రాజధాని కీవ్ సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చింది. రష్యా చర్యలను ఒకవైపు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధ్యక్షుడు పుతిన్ మాత్రం అదరలేదు.. కొంచెం కూడా బెదరలేదు. పైగా తన సైనిక బలగాన్ని మరింత రెచ్చగొడుతూ దాడులకు ప్రేరేపిస్తున్నాడు. ఒకవైపు ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ సభ్య దేశాలు కఠిన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు హెచ్చరించిన పుతిన్ వెనక్కి తగ్గలేదు. పైగా తమ చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు అణు ప్రయోగానికి కూడా
వెనుకాడబోనని గట్టిగానే హెచ్చరించాడు.

యుక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సాధారణ యుద్ధ విధానాన్నే ఫాలో అయింది. ముందుగా భారీగా సైన్యాన్ని సరిహద్దులకు పంపి.. ఆపై ఆదేశాలివ్వగానే ఒక్కసారిగా యుక్రెయిన్ పై క్షిపణుల వర్షాన్ని కురిపించింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా పుతిన్ ఏ ధైర్యంతో యుక్రెయిన్ పై దండయాత్రకు దిగారు అనేది సంచలనంగా మారింది. అసలు పుతిన్ ధైర్యం ఏంటి అనేది ఆరా తీయగా.. ఓ కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. పుతిన్ వెనుక ధైర్యానికి అదే కారణమట.. అందుకే అంతగా దూకుడుగా యుక్రెయిన్ సరిహద్దుల్లోకి దూసుకొస్తున్నాడట. ఇంతకీ ఎవరా పుతిన్ ధైర్యం అంటే.. మిలటరీ.. ఇదే పుతిన్‌కు ఎక్కడలేని శక్తినిచ్చేది. పుతిన్ వెనుక ఉండి వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. ఆయనే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుయే.. ఇతడే రష్యా యుద్ధానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఎన్నో ఏళ్ల నుంచి రష్యా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించింది ఈ సెర్గీ షోయిగుయే.. ఎన్నో ఏళ్ల నుంచి రష్యా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2012లో రక్షణ శాఖ బాధ్యతలను చేపట్టారు. పాశ్చాత్య దేశాలు ఆయనపై పెద్దగా దృష్టి సారించలేదు. FSB నేతృత్వంలో రష్యా చేసిన యత్నాలకు భిన్నంగా సెర్గీ షోయిగుయే ఆర్మీ పనిచేయడం ప్రారంభించింది. 2014లో క్రిమియాను ఆక్రమించడంతో పాటు సిరియాకు సంబంధించి షోయిగు విజయవంతమయ్యారు. దేశ భద్రత విషయంలో పుతిన్‌ వ్యూహాలను ఫెడర్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ (FSB) అమలు చేస్తుండేది. పశ్చిమ దేశాల నిఘా నేత్రాలన్నీ వారి కదిలికలపైనే ఉండేవి. పుతిన్‌ కేజీబీనే తర్వాతి కాలంలో FSBగా రూపాంతరం చెందింది. ఎప్పుడైతే షోయిగు రక్షణ శాఖ పగ్గాలు చేపట్టారో పరిస్థితులు మారిపోయాయి. సోవియట్‌ పతనంలో మాస్కోకు చేరుకున్న ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారు. అప్పుడే షోయిగు పుతిన్‌ దృష్టిని ఆకర్షించారు. 1999లో పార్టీలో కీలక నేతగా పుతిన్‌ షోయిగును నియమించారు.

Ukraine Russia War Who Is The Real Hero Behind Putins Aggressive Actions Against Ukraine Invasion (1)

Ukraine Russia War Who Is The Real Hero Behind Putin Aggressive Actions Against Ukraine Invasion 

Ukraine Russia War  : షోయిగుపై పుతిన్‌ నమ్మకమే… 
అప్పుడే దేశమంతా పర్యటించేందుకు ఆయనకు అవకాశం ఇచ్చారు. 2012లో రక్షణ మంత్రిని చేశారు. ఆర్మీపై పెద్దగా అవగాహన లేదు.. షోయిగుపై పుతిన్‌ నమ్మకమే అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్లింది. అత్యవసర పరిస్థితుల్ని చక్కదిద్దడంతో పాటు మంత్రిత్వ శాఖను సమర్థంగా నిర్వహించారు. అత్యంత ధైర్యవంతుడిగా గుర్తింపు పొందిన ఆయనే స్వయంగా అన్ని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎలాంటి విపత్తు సంభవించినా అన్నీ తానై ముందుండి నడిపించేవారు. అలా ఆయనకు నాయకత్వంతో పాటు ప్రజల్లో మంచి ఆదరణను తెచ్చిపెట్టింది. అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా పూర్తిచేసే షోయిగు ఆర్మీపై క్రమంగా పట్టు సాధించారు. ఆర్మీ అధికారులు కార్యాలయాలకు సూట్‌లు ధరించి రావడాన్ని నిషేధించడంతో ప్రక్షాళనను ప్రారంభించారు. సైనికుడెప్పుడూ యుద్ధక్షేత్రానికి సిద్ధంగా ఉండాలని.. ఆఫీసుల్లో కూర్చోవడానికి కాదని హెచ్చరించడంతో ఆయన ఆదేశాలు ఆరంభమయ్యాయి.

ఆ తర్వాత ఆర్మీ యూనిఫామ్‌ను 1945 నాటి సోవియట్‌ సేనల తరహాలో ఉండేలా మార్పులు చేశారు. దాన్ని రష్యా విజయానికి ప్రతీకగా భావిస్తుంటారు! ఆయన కూడా అదే ధరించడం ప్రారంభించారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్టాలిన్‌ హయాంలో పనిచేసిన గొప్ప ఫీల్డ్‌ మార్షల్‌ జార్జి జుకోవ్ తరహాలో కనిపించేవారు. ఇది ఆయనకు ప్రజల్లో మరింత ఆదరణను తీసుకొచ్చి పెట్టింది. 2014లో క్రిమియా ఆక్రమణలో షోయిగు మొదటి విజయం సాధించారు. రష్యా మద్దతుతో యుక్రెయిన్‌ అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌పై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత యనుకోవిచ్‌ దేశం విడిచి వెళ్లిపోయారు.

ఆర్మీని రంగంలోకి దింపి షోయిగు విజయం సాధించారు. గత ఏడాదిగా యుక్రెయిన్‌ ఆక్రమణకు రష్యా అనేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వీటిలో షోయిగుదే కీలక పాత్రగా చెప్పవచ్చు. యుక్రెయిన్‌పై సైనిక చర్యలోనూ షోయిగు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. లుహాన్స్క్‌, దోనెట్స్క్‌ను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించడంలోనూ ఈయన కీలకంగా వ్యవహరించారు. ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో పుతిన్ దౌత్యపరమైన ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గుతాడని అందరూ అనుకున్నారు. షోయిగు నేతృత్వంలోని మిలిటరీ ఇచ్చిన ధైర్యంతోనే పుతిన్ ఇప్పటివరకూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆ ధైర్యంతోనే యుక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకపడుతూనే ఉంది.

Read Also : Russia : యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై పంజా విసురుతున్న రష్యా