Indians Travel to UAE : భారతీయులు ఇకపై యూఏఈ వెళ్లొచ్చు.. కండీషన్స్ అప్లయ్!

భారతీయుల రాకపై విధించిన ఆంక్షలను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎత్తివేసింది. సెప్టెంబర్ 12 నుంచి యుఏఈకి భారతీయులు రావొచ్చునని వెల్లడించింది.

Indians Can Travel To Uae From September 12

Indians Can Travel to UAE From September 12 : భారతీయుల రాకపై విధించిన ఆంక్షలను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎత్తివేసింది. సెప్టెంబర్ 12 (ఆదివారం) నుంచి యుఏఈకి భారతీయులు రావొచ్చునని వెల్లడించింది. కొన్ని నెలలుగా భారత్ సైహా ఇతర దేశాల పౌరుల రాకపై యూఏఈ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్న భార‌త్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీ‌లంక‌, వియ‌త్నాం, నమీబియా, జాంబియా, కాంగో, ఉగాండ‌, సైరా లియోన్‌, లైబీరియా, సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఆఫ్ఘ‌నిస్థాన్ పౌరుల‌కు తమ దేశంలోకి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

యూఏఈ రెసిడెంట్ వీసా దారులు తిరిగి దేశానికి వచ్చేందుకు అనుమ‌తించిన‌ట్లు దేశ నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA), ఫెడ‌ర‌ల్ అథారిటీ ఫ‌ర్ ఐడెంటిటీ అండ్ సిటిజ‌న్ షిప్ (ICA) పేర్కొన్నాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఏడాది ఆలస్యం తర్వాత అక్టోబర్ 1న ఎక్స్‌పో 2020 వరల్డ్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి దుబాయ్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే విదేశీ పౌరుల రాకపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయాన్ని యూఏఈ తీసుకుంది. క‌రోనా ఆంక్ష‌ల‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ తిరిగి గాడిలోపెట్టేందుకు ఈ ఫెయిర్ దోహదపడుతుందని భావిస్తోంది.
CM KCR : లక్ష రూపాయల యంత్రం 20వేలకే.. ఆ వృత్తుల వారికి సీఎం కేసీఆర్ శుభవార్త

ఇవి తప్పనిసరిగా పాటించాలి :
1) నివాసితులు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ICA) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2) నివాసితులు ఆమోదం పొందడానికి టీకా దరఖాస్తును పూర్తి చేయాలి.
3) యూఏఈ బయలుదేరిన తర్వాత ఆమోదించిన టీకా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
4) దుబాయ్ బయలుదేరడానికి 48 గంటల్లోపు నెగటివ్ PCR టెస్టు ఫలితం వచ్చి ఉండాలి. QR కోడ్ ఆమోదిత ల్యాబ్‌లో బయలుదేరే ముందు సమర్పించాలి.
5) ప్రయాణీకులు ఎక్కే ముందు ర్యాపిడ్ PCR టెస్టు చేయించుకోవాలి.
6. యూఏఈ చేరుకున్నాక నాలుగు నుంచి ఎనిమిది రోజుల్లో మరో PCR టెస్టు చేయించుకుని అన్ని జాగ్రత్తలు పాటించాలి.
7) 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ విధానాలనుంచి మినహాయింపు ఉంటుంది.

ఇతర దేశాల్లో అనుమతి :
భారతీయ విమాన ప్రయాణికులు ఎవరైనా కోవిషీల్డ్ కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు మోతాదులను పొందితే.. 16 యూరోపియన్ దేశాల్లో ప్రయాణించవచ్చు. అందులో ఫ్రాన్స్, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐస్లాండ్, ఐర్లాండ్, లాట్వియా, నెదర్లాండ్స్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలు ఉన్నాయి. UK, ఖతార్, మెక్సికో, టర్కీ, పనామా, బహ్రెయిన్, బార్బడోస్ మరియు రువాండా దేశాల్లో కూడా ప్రయాణించవచ్చు. కానీ, తప్పనిసరిగా క్వారంటైన్ చేయించుకోవడం ఉత్తమం.
Extraterrestrial Satellite : భూమికి దగ్గరలో ఏలియన్స్..? మిస్టీరియస్ శాటిలైట్ పై నాసా క్లారిటీ