Fungi in Mars Photos: మార్స్ మీద ఫంగస్ గుర్తింపు.. పరిశోధకులు ఏమంటున్నారంటే?

అంగారక గ్రహంపై మానవ జీవనానికి అనువైన పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రపంచ దేశాలకు చెందిన స్పేస్​ ఏజెన్సీలు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేపట్టాయి. అయితే, ఈ ప్రయోగాల్లో అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (NASA) ముందుంది

Fungi in Mars Photos: అంగారక గ్రహంపై మానవ జీవనానికి అనువైన పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రపంచ దేశాలకు చెందిన స్పేస్​ ఏజెన్సీలు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేపట్టాయి. అయితే, ఈ ప్రయోగాల్లో అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (NASA) ముందుంది. ఇప్పటికే ఎన్నో ఉపగ్రహాలను అంగారక గ్రహంపైకి పంపిన NASA.. తాజాగా గ్రహంపై వాతావరణం, ఖనిజ నిల్వలు, నీటి జాడలను కనిపెట్టడమే ముఖ్య లక్ష్యంగా మార్ష్‌పై ప్రయోగాలు జరిపింది. ఆ ప్రయోగాల తాలూకు ఫోటోలు, వీడియోలు కూడా భూమి మీదకి చేరగా వీటిపై భారీ ప్రయోగాలే జరిపింది. కానీ ఎక్కడా ఫంగస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు లాంటి ఆనవాళ్లు ఆ ఫోటోలలో కనిపించినట్లుగా NASA కూడా స్పష్టంగా చెప్పలేదు.

కానీ, తాజాగా Advances in Microbiologyలో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం Mars ఉపరితలం యొక్క క్లోజప్ ఫోటోలను చూస్తే ఆ గ్రహం మీద ఫంగస్ ఉనికి సజీవంగా ఉన్నట్లు అనుమానించాల్సి వస్తుంది. ఒక విధంగా ఈ ప్రచురణ పరిశోధకుల సొంత వాదనగా అనిపించినా NASA విడుదల చేసిన ఫోటోలు, నివేదికల ఆధారంగానే ఇది విడుదల చేశారు. కొందరు శాస్త్రవేత్తల వాదన కూడా ఈ ప్రచురణకు బలం చేకూరుస్తుంది. Mars మీద ఫంగస్ ఉండేందుకు ఆస్కారముందని.. అక్కడి మట్టిలో జీవరాసుల ఆవాసం ఉండొచ్చనే అభిప్రాయాన్ని పరిశోధకులు వినిపిస్తున్నారు.

NASA విడుదల చేసిన కొన్ని ఫోటోలలో Mars ఉపరితలం యొక్క లైకెన్ కవరింగ్ భాగాలలో తెల్లటి పాచెస్, మరికొన్ని గుండ్రటి పాచెస్ భూమిపై పఫ్బాల్ శిలీంధ్రాలతో సమానంగా ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. రేడియేషన్ తీవ్రమైన వాతావరణంలో శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయని పరిశోధకులు రాశారు. ఫంగస్ లాంటి మార్టిన్ నమూనాలు నేల నుండి ఉద్భవించి రేడియేషన్ ప్రభావంతో పెరుగుతాయని, ఇవి పఫ్ బాల్స్ (బాసిడియోమైకోటా)ను పోలి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నల్ల శిలీంధ్రాలు-బ్యాక్టీరియా లాంటి నమూనాలు అక్కడి రోవర్లపైన కూడా కనిపించాయి. మూడు రోజుల వరుస ఫోటోలను చూస్తే పగుళ్లలోని తెల్లని నిరాకార నమూనాలు ఫంగస్ ఉనికిని స్పష్టం చేస్తున్నాయని చెప్తున్నారు.

Fungi In Mars Photos

పఫ్ బాల్స్ అని పిలవబడేది NASA అంగారక గ్రహం మీద వివిధ ప్రదేశాలలో గమనించిన బ్లూబెర్రీస్గా కనిపిస్తుంది. మరికొన్ని ఫోటోలను వివరించడానికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పిన ఆ ప్రచురణలో జీవ ప్రక్రియలను అనుకరించే అనేక భౌగోళిక ప్రక్రియలు మాత్రం అక్కడ ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, ప్రయోగాలు జరిపిన NASA కూడా తన రోవర్ ఫోటోల ద్వారా అక్కడ ఫంగస్, బ్యాక్తీరియాపై ఏ విషయాన్ని తేల్చచెప్పకపోగా Advances in Microbiology ప్రచురణ మాత్రం అంగారక మీద మనిషి జీవనం అనే ఆశలు కలిగిస్తున్నాయి.

ఏది ఏమైనా Mars మీద NASA ప్రయోగాలు ఇప్పుడు చాలా ముందడుగు వేశాయి. నాసా ఎప్పటి నుంచో అరుణ గ్రహం మీద జీవ జాలం ఉనికి ఉందని గట్టిగా నమ్ముతోంది. దాదాపుగా వారు ఊహించిన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలి పరిశోధనల్లో అందుకు కొన్ని ఆనవాళ్ళు కూడా దొరికాయని నిపుణులు అంటున్నారు. మిగిలిన గ్రహాలతో పోలిస్తే భూమిని పోలిన వాతావరణం కొంత అక్కడ ఉందని పరిశోధకులు బలంగా నమ్ముతున్నారు. తాజాగా  Advances in Microbiology ప్రచురణ కూడా అదే విషయంలో శాస్త్రీయంగా అనుమానాలు లేవనెత్తింది. మరి ఈ ప్రచురణ దిశగా ప్రయోగాలు చేపడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

read: Women Order IPhone: ఐఫోన్ ఆర్డ‌ర్ ఇచ్చిన మహిళ.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్!

ట్రెండింగ్ వార్తలు