Pak funny laws : గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపిస్తే జైలుశిక్ష..ఒకరి ఫోన్ మరొకరు టచ్ చేస్తే ఫైన్..వింత చట్టాలుండే దేశం ఇదే

చట్టాల విషయంలో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన రూల్ ఉంటుంది. కొన్ని దేశాల్లో ఉండే చట్టాల గురించి తెలిస్తే ఫన్నీ అనిపిస్తుంది. మరికొన్ని క్రేజీ అనిపిస్తాయి. అటువంటి చట్టాలు ఉన్నదేశం

Pakistan funny laws : ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో రూల్..ఒక్కో రకమైన చట్టాలుంటాయి. ఈ చట్టాల గురించి తెలిస్తే వామ్మో ఇటువంటివేంటిరా బాబూ అనిపిస్తుంది. సిల్లీ అనిపిస్తాయి. ఫన్నీగా కూడా అనిపిస్తాయి. మరికొన్ని చాలా చాలా కఠినంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మహిళల విషయంలో..ఇస్లామిక్ దేశాల్లో ఉండే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అటువంటి ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ లో ఉండే కొన్ని వింత చట్టాల గురించి తెలిస్తే ఫన్నీ అనిపిస్తాయి. చిత్రంగా అనిపించే చట్టాలు ఉండే దేశాల్లో పాకిస్తాన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. మరి ఆ వింత చట్టాలేంటో తెలుసుకుందాం..

పాకిస్తాన్ లో చట్టలు చాలా కఠినంగాను ఉంటాయి. వినటానికి చాలా ఫన్నీగా ఉంటాయి. అటువంటి వింత చట్టంలో భాగంగా పాకిస్తాన్‌లో అనుమతి లేకుండా ఒకరి ఫోన్‌ను వాడకూడదు.కనీసం దాన్ని తాక కూడదు కూడా. అలా చేస్తే చట్ట విరుద్దం. ఇలా చేస్తూ పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

పాకిస్తాన్‌లో మరో వింత చట్టం ఏమిటంటే..అబ్బాయి గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపిస్తే అది ఎవరన్నా చూసి ఫిర్యాదు చేస్తే అతనికి జైలుశిక్ష పడుతుంది. పెళ్లికి ముందు ఏ అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించకూడదు. కలిసి తిరగకూడదు. దీని కోసమే పాకిస్థాన్ లో కఠిన నియమం పెట్టారు. ఈ నిబంధన ఉల్లంఘించకూడదనే ఉద్ధేశ్యంతో అబ్బాయి అమ్మాయి కలిసి బయట తిరిగితే వారిపై చర్యలుంటాయి. అతనికి జైలుశిక్ష పడుతుంది.

పాకిస్తాన్‌లో..అల్లాహ్, మస్జిద్, రసూల్ లేదా నబీని ఆంగ్లం (ఇంగ్లీష్ ) లో అనువదించడం (ట్రాన్స్ లేట్ ) చట్టవిరుద్ధం. ఎవరైనా ఇలా చేసి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో జైలుశిక్ష కూడా విధిస్తారు.

ఒక విద్యార్థి అయినా..విద్యార్థిని అయినా చదువుకుంటే వారు పరిమితమైన డబ్బుని ఖర్చు చేయాలి. చదువు ఖర్చుకు గానీ వారు సంవత్సరానికి 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. అలా ఖర్చు చేస్తే సదరు విద్యార్ధి 5% పన్ను ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రజలు ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లటం చాలా తక్కువగా ఉంటారు.

పాకిస్తాన్ దేశ పౌరులు ఇజ్రాయెల్ సందర్శించడానికి వీల్లేదు. అందుకే పాకిస్థాన్ పౌరులకు ప్రభుత్వం ఇజ్రాయెల్ వీసా ఇవ్వదు. పాకిస్థాన్ దృష్టిలో ఇజ్రాయెల్ దేశమే కాదు. అందుకే పాకిస్తాన్ తన పౌరులకు ఇజ్రాయెల్ వెళ్లడానికి వీసాలు జారీ చేయదు.  

పాకిస్థాన్ లో ప్రధానమంత్రిని గానీ లేదా ఏ ప్రభుత్వ అధికారిని ఎగతాళి చేయకూడదు. అలా చేయకూడదని పాకిస్తాన్‌లో చట్టం ఉంది. అలా చేస్తే..భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి జైలుశిక్ష కూడా పడే అవకాశాలుంటాయి. ఆయా పరిస్థితిని బట్టి ఒక్కోసారి జరిమానాతో పాటు జైలుశిక్ష రెండూ పడే అవకాశాలున్నాయి. వీటితో పాటు పాకిస్తాన్‌లో ఎవరికైనా స్పామ్ సందేశాలు పంపడం చట్టవిరుద్ధం. అలా పట్టుబడితే, మీరు రూ. 10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

ట్రెండింగ్ వార్తలు