పికాసో మళ్లీ పుట్టాడా : లక్షలకు అమ్ముడైన బుడతడి పెయింటింగ్

  • Publish Date - January 13, 2020 / 06:37 AM IST

ప్రముఖ ఫ్రాన్స్ చిత్రకారుడు పికాసో (పాబ్లో పికాసో) మళ్లీ పుట్టాడా..అనిపించేలా పెయింటింగ్ వేస్తున్నాడు ఏడు సంవత్సరాల పిల్లాడు. జర్మనికిం చెందిన ఏడేళ్ల బాలుడు  మిఖాయిల్ అకర్  గీసిన పెయింటింగ్ రూ. 8.51 లక్షలకు అమ్ముడుపోయింది. 

మిఖాయిల్ అకర్ వేసిన ఓ పెయింటింగ్ కొనటానికి జర్మనీ నలుమూలల నుంచి బెర్లిన్ చేరుకున్నారు అంటే మిఖాయిల్ పెయింటింగ్స్ కు ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు.  2012లో పుట్టిన మిఖాయిల్ అకర్ తన నాలుగేళ్ల వయసు నుంచి పెయింటింగ్స్ వేస్తున్నాడు. అసాధరణమైన తన ప్రతిభతో కేవలం మూడూ సంవత్సరాలలోనే మిఖాయిల్ అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. 

పెయింటింగ్ లో దిగ్గజాల సరసన చేరాడు. మిఖాయిల్‌ వేసిన పెయింటింగ్స్ చూసిన ప్రతీ వారు పికాసో మళ్లీ పుట్టాడా అంటున్నారు. ప్రశంసిస్తున్నారు. ఈ బుడతడు వేసిన పెయింటింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. పాబ్లో పికాసో (1881-1973) స్పెయిన్ లో ప్రఖ్యాత చిత్రకారునిగా పేరు గాంచాడు. మిఖాయిల్‌కు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి కెరమ్ అకర్ కొడుకుకు ఉన్న ఆసక్తిని గమనించి కేన్వాస్, పెయింట్లు గిఫ్టుగా ఇచ్చాడు. 

వాటితో పెయింటింగ్ వేసిన మిఖాయిల్‌ను చూసి తండ్రి ఎంతగానో మురిసిపోయాడు. తన కొడుకు ప్రతిభను చూసి పుత్రోత్సాహంతో మురిసిపోయేవాడు.  మిఖాయిల్ జర్మనీకి చెందిన స్టార్ ఫుట్ బాలర్ మాన్యూల్ నోయిర్ పెయింటింగ్ రూపొందించాడు. ఇది ఎనిమిదిన్నర లక్షల ధర పలికింది. కాగా మిఖాయిల్‌కు ఇన్ స్టాగ్రామ్‌లో 40 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించాడు.