Ghulam Nabi Azad political party
Ghulam Nabi Azad Gets Threat: కాంగ్రెస్ పార్టీని వీడి జమ్మూకశ్మీర్ లో ర్యాలీలకు సిద్ధమవుతున్న గులాం నబీ ఆజాద్ కు పాక్ లోని లష్కర్ తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్ సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు చేసింది.
బీజేపీ రాజకీయ అజెండాలో భాగంగా నిర్వాసిత కశ్మీరీ పండిట్లను వాడుకుంటోందని చెప్పింది. అలాగే, బీజేపీ ప్లాన్-బీలో భాగంగా జమ్మూకశ్మీర్ లో ఆజాద్‌ను వాడుకుంటోందని తెలిపింది. గతంలో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కశ్మీరీ హిందూ రాహుల్ భట్ (ప్రభుత్వ ఉద్యోగి) భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తో టచ్ లో ఉండేవాడని పేర్కొంది.
ఆజాద్ రాజకీయ ఊసరవెల్లిలాంటి వాడని చెప్పుకొచ్చింది. ఆయనకు విధేయత లేదని, అందరి ముందూ నమ్మకస్తుడిలా ప్రవర్తిస్తుంటాడని, అయితే, ఆయన ద్రోహి అని చెప్పింది. కశ్మీర్ రాజకీయాలపై ఆయన ప్రణాళికలో భాగంగానే ఆసక్తి చూపుతున్నారని ఆరోపించింది. ఇటువంటివి ఉపేక్షించబోమని చెప్పుకొచ్చింది.
Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదు