Thailand Daycare Centre Shooting: నిద్రపోయి ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి..! ఆత్మలే తన కుమార్తెను రక్షించాయన్న తల్లి..

థాయ్‌లాండ్‌లోని డే కేర్ సెంటర్‌లో ఇటీవల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 24మంది చిన్నారులు మరణించిన విషయం విధితమే. పవీనుచ్ సుపోల్వాంగ్ అనే మూడేళ్ల చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. కాల్పులు జరిగిన సమయంలో ఆ చిన్నారి గాఢనిద్రలో ఉండటంతో ప్రాణాలు దక్కించుకుంది. అయితే ఆమె తల్లి మాత్రం ఆత్మలే తన మూడేళ్ల చిన్నారిని కాపాడినట్లు తెలిపింది.

Thailand Daycare Centre Shooting: థాయ్‌లాండ్‌లో ఓ డే కేర్ సెంటర్‌లో గత గురువారం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 30మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో 24 మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఈ కాల్పుల్లో పవీనుచ్ సుపోల్వాంగ్ అనే మూడేళ్ల చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. కాల్పులు జరిపిన సమయంలో ఆ చిన్నారికూడా మరణించిన తోటి స్నేహితులతో కలిసే ఉంది. అయితే, బాలిక ఆ సమయంలో నిద్రపోతుంది.

థాయ్‌లాండ్‌లో దుండగుడు కాల్పులు జరిపిన డే కేర్ సెంటర్ ఇదే..

సాధారణంగా.. పవీనుచ్ సుపోల్వాంగ్ ఇంట్లో కానీ, డే కేర్ సెంటర్‌లో గానీ నిద్రపోయే సమయంలో చిన్నపాటి శబ్దం వచ్చినా లేస్తుంది. కానీ కాల్పులు జరిపిన రోజు గాఢనిద్రలో ఉంది. దీంతో దుండగుడు జరిపిన కాల్పుల శబ్ధాని లేవలేదు. పవీనుచ్ సుపోల్వాంగ్ గాఢ నిద్రపోవటం వల్లనే ప్రాణాలతో బయటపడిందని తల్లి పనోమ్‌పాయ్ సింతోంగ్ పేర్కొంది. గాఢ నిద్రలో లేకుంటే దుండగులు జరిపిన కాల్పుల శబ్దానికి పాప లేచేదని, అప్పుడు ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదని తెలిపింది. తన పాప బతికినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఇతర పిల్లల కుటుంబాలను చూస్తే తనకు ఎంతో బాధ వేస్తోందని ఆమె తెలిపింది.

three year old girl Paweenuch Supolwong

ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి ఆ చిన్నారికి తెలియదని తెలిపారు. ఈ ఘటన సమయంలో ఆ చిన్నారి గదిలో ఓ మూలన దుప్పటి కప్పుకొని నిద్రిస్తుందని, పక్కనే ఉన్న 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కాల్పుల అనంతరం ఆ చిన్నారి నిద్రలోనే ఉందని, దుప్పటి కప్పి ఉంచడంతో.. మేము వెళ్లి చూడగా బతికే ఉందని నిర్ధారించుకున్నామని, అలాగే దుప్పటితో ఆమె ముఖాన్ని కప్పి తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయితే, తన కుమార్తె ప్రాణాలతో బతికి ఉండటానికి ఆత్మలే కారణమని ఆమె తల్లి పనోమ్‌పాయ్ సింతోంగ్ పేర్కొంది. చిన్నపాటి శబ్దం చేస్తేనే ఎంత నిద్రలో ఉన్నా మేల్కొనే మా పాప.. భారీ శబ్దంతో కాల్పులు జరిగినా లేవలేదని, ఆ సమయంలో ఆమె కళ్లు, చెవులను ఆత్మలు మూసేసినట్లు నేను నమ్ముతున్నానని పనోమ్‌పాయ్ సింతోంగ్ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు