6 మిలియన్లు దాటిన గ్లోబల్ కరోనా కేసులు.. 3లక్షల 70వేల మరణాలు

  • Publish Date - June 1, 2020 / 01:48 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఆదివారం నాటికి బ్రెజిల్‌లో 6 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద 3,70వేల మరణాలు నమోదు అయ్యాయి. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రాంతాలవారీగా వైరస్ వ్యాపిస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించగా ఆంక్షలతో కూడిన అనుమతులు ఉన్నాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడంతో పాటు మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. సౌత్ అమెరికాలో కరోనా హాట్ స్పాట్ అయిన బ్రెజిల్ లో దాదాపు 5 లక్షల కేసులు నమోదు అయ్యాయి. కరోనా నియంత్రించేందుకు అమలు చేసిన లాక్ డౌన్ చర్యలపై అక్కడి రాజకీయ నేతలు వ్యతిరేకించడంతో దాదాపు 30వేల మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. 

క్వారంటైన్ చర్యలతో వైరస్ ప్రభావం కంటే ఆర్థిక సంక్షోభం ప్రభావం అధికంగా ఉంటుందని అధ్యక్షుడు Jair Bolsonaroలో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ కంటే అత్యధికంగా కరోనా మరణాలు నమోదు కావడంతో ప్రపంచంలో నాల్గో అతిపెద్ద దేశంగా నిలిచింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇచ్చే నిధుల విషయంలో శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్ నియంత్రణపై WHO చైనాకు మద్దతుగా నిలిచిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 3,70వేల మంది మరణించినట్టు AFP టాలీ నివేదించింది. 

శనివారం నాటికి బ్రిటన్ లో 960 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. సోమవారం లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్టు ప్రకటించడాన్ని అక్కడి సలహాదారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంగ్లండ్‌లో లాక్ డౌన్ ఎత్తివేయడంతో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు సోమవారం నుంచి సౌతాఫ్రికా కూడా అర్థిక కార్యకలాపాలను పున:ప్రారంభించనుంది. భారతదేశం కూడా జూన్ 1 నుంచి లాక్ డౌన్ అమలలో సడలింపులు ప్రకటించింది. సుమారు 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. (కరోనా విజృంభణ.. టాప్-10దేశాల్లో 8వ స్థానానికి చేరిన భారత్)