Titanic Captain Gold pocket watch
Arthur Rostron Gold pocket watch auction: పాకెట్ గడియారం వేలంలో రికార్డు ధర పలికింది. 18 క్యారట్ల బంగారంతో టీఫానీ అండ్ కో సంస్థ తయారు చేసిన ఈ గడియారాన్ని సుమారు 20లక్షల డాలర్లు (రూ.16.9కోట్లు)కు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ గడియారం వేలంలో భారీ ధరకు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఉంది. ఈ గడియారం ఇప్పటిదికాదు.. టైటానిక్ ఓడ ప్రమదం సమయంలోనిది. టైటానిక్ ఓడ ప్రమాదం జరిగినప్పుడు 700 మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ ఆర్ధర్ రోస్ట్రన్ కు చెందినది. దీంతో వేలంలో భారీ మొత్తంలో నగదు వెచ్చించి ఈ గడియారాన్ని ఓ వ్యక్తి దక్కించుకున్నాడు.
ఆ ముగ్గురు బహుమతిగా ఇచ్చారు..
టైటానిక్ ఓడ ప్రమాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. దీనిపై సినిమాలుసైతం వచ్చాయి. 1912 ఏప్రిల్ 15న టైటానిక్ ఉత్తర అట్లాంటిక్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ఓడ మునిగిపోతున్న సమయంలో అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఆర్ఎంఎస్ కార్పథియా ఓడలోని రేడియో ఆపరేటర్ కు తెల్లవారుజామున సమయంలో అత్యవసర సందేశం వచ్చింది. అదివిన్న కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్ వెంటనే అప్రమత్తమై ఓడను టైటానిక్ షిప్ వైపు మళ్లించాడు. అక్కడకు చేరుకొని టైటానిక్ షిప్ లో ఉన్న 20 లైఫ్ బోట్ల సాయంతో 700 మందిని రక్షించి న్యూయార్క్ కు చేర్చారు. టైటానిక్ ఓడ ప్రమాదంలో1500 మందికిపైగా మరణించారు. వారిలో సంపన్న వ్యాపారి జాన్ జాకోబ్ ఆస్టర్ తో పాటు మరో ఇద్దరు సంపన్నులు కూడా ఉన్నారు. జాకోబ్ ఆస్టర్ తో పాటు మరో ఇద్దరు సంపన్నుల భార్యలను కెప్టెన్ రోస్ట్రన్ రక్షించాడు. దీంతో తమ ప్రాణాలు కాపాడినందుకు రోస్ట్రన్ కు కృజ్ఞతగా ఆ ముగ్గురు కలిసి ఈ గడియారాన్ని అందించారు.
భారీ ధర పలికింది..
నాడు ముగ్గురు సంపన్నుల భార్యలు కలిసి కానుకగా అందించిన గడియారం నేడు భారీ ధర పలికింది. 16.9 కోట్లకు ఓ వ్యక్తి దానిని వేలంలో కొనుగోలు చేశాడు. ఇదిలాఉంటే.. టైటానిక్ దుర్ఘటన జరిగిన వారంరోజుల తరువాత ఓడ శిథిలాల నుంచి జాన్ జాకోబ్ ఆస్టర్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆ సమయంలో అతడు ధరించి ఉన్న పాకెట్ గడియారాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో వేలం వేయగా సుమారు 15లక్షల డాలర్లు పలికింది.