యూరప్ లో ఆన్ లైన్ పర్సనల్ డేటాకు సంబంధించి ‘రైట్ టు బి ఫర్గాటెన్’ రూల్స్ కేసులో ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కు భారీ ఊరట లభించింది.
యూరప్ లో ఆన్ లైన్ పర్సనల్ డేటాకు సంబంధించి ‘రైట్ టు బి ఫర్గాటెన్’ రూల్స్ కేసులో ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కు భారీ ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా సున్నితమైన వ్యక్తిగత డేటాకు సంబంధించి లింకులను సెర్చ్ రిజల్ట్స్ నుంచి తొలగించాలనే ఫ్రెంచ్ డిమాండ్ ను యూరప్ టాప్ కోర్టు తిరస్కరించింది. పర్సనల్ డేటా లింక్స్ తొలగించాల్సిన అవసరం లేదని గూగుల్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. యూరప్ సరిహద్దులు అవతల కూడా ఈయూ ఆన్ లైన్ రెగ్యులేషన్ వర్తిస్తుందనే వాదనను కోర్టు తిరస్కరించింది.
రైట్ టూ బి ఫర్ గాటెన్ రూల్స్ ను గూగుల్ కు గ్లోబల్ గా వర్తించదని మంగళవారం (సెప్టెంబర్ 24, 2019) యూరోపియన్ టాప్ కోర్టు వెల్లడించింది. సెర్చ్ ఇంజిన్ ప్రమేయం ఉన్న రెండు వేర్వేరు కేసులపై విచారించిన యూరోప్ టాప్ కోర్టు.. యూరప్ దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ డేటాను డిలీట్ చేయడం లేదా సెర్చ్ రిజల్ట్స్ లో సున్నితమైన సమాచారాన్ని ఆటోమాటిక్ డిలీట్ చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
యూరప్ యూనియన్ సిటిజన్స్ కు సంబంధించి బ్లాక్ 28 మెంబర్ స్టేట్స్ లో మాత్రమే సెర్చ్ రిజల్ట్స్ గూగుల్ డిలిస్టింగ్ వర్తిస్తుందని తెలిపింది. యూరోపియన్ చట్టం ప్రకారం.. అక్కడి పౌరులు నేరాలకు సంబంధించిన డేటాను గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్ ల నుంచి తొలగించాలని అడిగే హక్కు ఉంది. దాన్నే రైట్ టు బి ఫర్గాటెన్ అంటారు.
ఐదేళ్ల క్రితమే ఈ రూల్ అమల్లోకి వచ్చింది. 2016లో ఫ్రాన్స్ ప్రైవసీ వాచ్ డాగ్ CNIL గూగుల్ కు లక్ష యూరోలు (109,889) జరిమానా విధించింది. రైట్ టూ బి ఫర్ గాటెన్ రూల్ కింద ఇంటర్నెట్ లోని సెర్చ్ రిజల్ట్స్ లో సున్నితమైన సమాచారాన్ని తొలగించేందుకు గూగుల్ తిరస్కరించింది. దీంతో గూగుల్ కు భారీ జరిమానా విధించింది.
మరోవైపు ప్రైవసీ డేటా విషయంలో యూనైటెడ్ స్టేట్స్ లోని అధికారుల నుంచి కూడా గూగుల్ ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇటీవల గూగుల్ సొంత సంస్థ యూట్యూబ్ పై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించడంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో న్యూయార్క్ అటార్నీ జనరల్, యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 170 మిలియన్ల డాలర్లు చెల్లించాల్సిందిగా ప్రకటించింది.