Google Layoffs 12,000 Employees : 12,000 మంది గూగుల్ ఉద్యోగుల తొలగింపు..క్షమాపణలు చెప్పిన సీఈవో సుందర్ పిచాయ్
ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో దిగ్గజ కంపెనీలే వేలాదిమంది ఉద్యోగులను తొలగించేసుకుంటున్నాయి. భారం దింపేసుకుంటున్నాయి. ఇదే బాటలో నడిచింది ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఉద్యోగుల్ని తొలగించక తప్పని పరిస్థితి ఉందని తెలుపుతూ సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణ చెప్పారు.
- nagamani
- Published On : January 21, 2023 / 11:25 AM IST
Google Layoffs 12,000 Employees
Google layoffs 12,000 Employees : ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో దిగ్గజ కంపెనీలే వేలాదిమంది ఉద్యోగులను తొలగించేసుకుంటున్నాయి. భారం దింపేసుకుంటున్నాయి. ఇదే బాటలో నడిచింది ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఉద్యోగుల్ని తొలగించక తప్పని పరిస్థితి ఉందని తెలుపుతూ సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణ చెప్పారు.
Amazon CEO Andy Jassy: అమెజాన్‌లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతుంది..
ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా,ట్విట్టర్,అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల భారాన్ని తగ్గించుకున్నాయి. ఈ ప్రక్రియ కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతోంది. తాజాగా ఐటీ దిగ్జజం గూగులు కూడా అదే బాటలో నడవక తప్పని స్థితి. దీంతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణ చెప్పారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్
గూగుల్ సంస్థలో ఉన్న మొత్తంలో ఆరుశాతం ఉద్యోగులు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ పరిస్థితిపై సుందర్ పిచాయ్ క్షమాపణ చెబుతూ ఉధ్యోగులు మరో జాబ్ చూసుకునేవరకు సహాయం అందిస్తామని తెలిపారు.
Amazon Layoff: ఇండియాలోనూ ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. ఎంతమందో తెలుసా?
