Amazon CEO Andy Jassy: అమెజాన్‌లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతుంది..

అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటితో ఆగదని, 2023లో కూడా కొనసాగుతోందని అమెజాన్ సీఈవో ఆండి జాస్పీ ధృవీకరించారు. ఇప్పటికే ఆ సంస్థ టాప్ డిపార్ట్ మెంట్ ల నుంచి కొందరు ఉద్యోగులను తొలగించిందని తెలిపారు

Amazon CEO Andy Jassy: అమెజాన్‌లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతుంది..

amazon

Amazon CEO Andy Jassy: ప్రస్తుత ఆర్థిక మందగమనం అతిపెద్ద ప్రపంచ టెక్ దిగ్గజాలను వణికిస్తోంది. ఈ క్రమంలో సంస్థ నష్టాలను అదిగమించేందుకు పెద్ద‌పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ట్విటర్, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాతో పాటు అమెజాన్ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గింపు ప్రక్రియను చేపట్టింది. అమెజాన్ వచ్చే రెండు నెలల కాలంలో పదివేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని, ఈ క్రమంలో తొలగింపు ప్రక్రియనుసైతం ప్రారంభించినట్లు నివేదిలకు పేర్కొంటున్నాయి. కాలిఫోర్నియాలోని వివిధ విభాగాల్లో సుమారు 260 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఆ సంస్థ తెలియజేసింది. భారత్ లోనూ తొలగింపుప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది.

Amazon Lays Off Employees: అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ.. ఇంటిబాట పట్టనున్న 10వేల మంది..!

అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటితో ఆగదని, 2023లో కూడా కొనసాగుతోందని అమెజాన్ సీఈవో ఆండి జాస్పీ ధృవీకరించారు. ఇప్పటికే ఆ సంస్థ టాప్ డిపార్ట్ మెంట్ ల నుంచి కొందరు ఉద్యోగులను తొలగించిందని తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కంపెనీ ఉద్యోగులకు పంపిన నోట్‌లో సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టులో నేను ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత కఠినమైందని తెలిపారు.

Amazon In India: భారత్‭లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న అమెజాన్.. ఉద్యోగాలపై భారీ వేటు!

గత కొన్ని నెలలుగా వివిధ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాలని అమెజాన్‌ నిర్ణయించుకుందని, ఎక్కువగా ఆదా చేయడానికి ఆస్కారమున్న విభాగాలను గుర్తించడానికి సమీక్షలు సైతం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే కొన్ని విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులు, గత కొన్నేళ్లుగా కంపెనీ చేపట్టిన వేగవంతమైన నియామకాల కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జాస్పీ తెలిపారు.