Amazon In India: భారత్‭లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న అమెజాన్.. ఉద్యోగాలపై భారీ వేటు!

అమెజాన్‌కు అమెరికా తర్వాత అతి పెద్ద మార్కెట్, వినియోగదారులు ఉన్న దేశం భారతే. దీనికి తోడు అమెజాన్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా సేవలను విస్తరించడంతో పాటు 50 వేల కోట్ల రూపాలయలకు పైగా పెట్టుబడులు పెట్టినప్పటికీ అదిరిపోయే లాభాలు గడించడం మాత్రం అమెజాన్‌కు సవాల్‌గా మారింది

Amazon In India: భారత్‭లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న అమెజాన్.. ఉద్యోగాలపై భారీ వేటు!

Amazon In India: ప్రపంచ వ్యాప్తంగా ఈ-కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే బాటలో అమెజాన్ కూడా నడుస్తోంది. అయితే అమెజాన్ తొలగిస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత్‭లోనే కావడం గమనార్హం. కారణం, ఇక్కడ ఆ సంస్థకు ఆశించిన లాభాలు రాకపోవడం. ఇండియాలో ఎంతో ఆర్భాటంగా కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ అమెజాన్‭కు కలిసి రావడం లేదు. ఎనిమిదేళ్లు దాటినా కళ్లు చెదిరే లాభాలను కొల్లగట్టడంలో మాత్రం ఈ సంస్థ విఫలమవుతూనే ఉంది.

అమెజాన్‌కు అమెరికా తర్వాత అతి పెద్ద మార్కెట్, వినియోగదారులు ఉన్న దేశం భారతే. దీనికి తోడు అమెజాన్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా భారత్ ఒకటి. దేశవ్యాప్తంగా సేవలను విస్తరించడంతో పాటు 50 వేల కోట్ల రూపాలయలకు పైగా పెట్టుబడులు పెట్టినప్పటికీ అదిరిపోయే లాభాలు గడించడం మాత్రం అమెజాన్‌కు సవాల్‌గా మారింది. ఇక దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా కూడా కంపెనీకి ఆశించిన లాభాలు రాకపోవడంతో భారత్‭లో వందల సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకోవాలని అమెజాన్ భావిస్తోంది.

భారతదేశంలో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. వాస్తవానికి ఇదే బాటలో మెటా సంస్థ కూడా పయనిస్తోంది. అయితే దానితో పోల్చుకుంటే అమెజాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు, మెటా కంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని అమెజాన్ తొలగించనున్నట్లు ఆయన వెల్లడించారు. అనుబంధ సేవలు, బ్యాక్-ఆఫీస్, రిటైల్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న వందలాది మంది అమెజాన్ ఇండియా ఉద్యోగులు ముప్పులో ఉన్నట్లు బెంగళూరులోని రిక్రూట్‌మెంట్ సేవల సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఇంజినీరింగ్ సహా ఇతర విభాగాల్లో ఉద్యోగాల కోత ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Musk Ultimatum: ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పిన మస్క్.. అలా చేయకపోతే ఇక ఎవరైనా ఇంటికేనట!