Amazon Lays Off Employees: అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ.. ఇంటిబాట పట్టనున్న 10వేల మంది..!

ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10వేల మందిని(3శాతం) తొలగించనున్నట్లు సమాచారం. ప్రధానంగా డివైజెస్, రిటైల్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు సీఎన్‌బీఎసి తెలిపింది.

Amazon Lays Off Employees: అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ.. ఇంటిబాట పట్టనున్న 10వేల మంది..!

Amazon

Amazon Lays Off Employees: అమెరికా ఇ- కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్.. తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధంచేసింది. ప్రపంచ వ్యాప్తంగా 10వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. సంస్థలో ఇకపై కొన్నివిభాగాల్లో ఉద్యోగులు అవసరం లేదని నిర్ణయించినట్లు హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ సిబ్బంది రాసిన లేఖలో పేర్కొన్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. గత కొద్దిరోజుల క్రితమే ట్విటర్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా బాటలో అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగిస్తుందని, ఈ వారం చివరి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, ఉద్యోగుల తొలగింపు విషయంలో పలు దఫాలుగా చర్చలు జరిపిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని అమెజాన్ తెలిపింది.

Amazon In India: భారత్‭లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న అమెజాన్.. ఉద్యోగాలపై భారీ వేటు!

పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం కొన్ని విభాగాల్లో కొందరి ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో డేవ్ లింప్ తెలిపారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను మేము కోల్పోతున్నామని మాకు తెలుసని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని అన్నారు. ఈ వార్తను తెలిపేందుకు నేను చాలా బాధపడుతున్నానని, ఉద్యోగం కోల్పోయిన వారికి కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డేవ్ లింప్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Amazon Lay Off: ఇక అమెజాన్ వంతు.. 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన అమెజాన్

ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10వేల మందిని(3శాతం) తొలగించనున్నట్లు సమాచారం. ప్రధానంగా డివైజెస్, రిటైల్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు సీఎన్‌బీఎసి తెలిపింది. ఇప్పటికే మేనేజర్లు ఆయా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. రెండు నెలల్లోగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలు చేపట్టడాన్నికూడా నిలిపివేసినట్లు ఇటీవలే అమెజాన్ వెల్లడించిన విషయం విధితమే.