Amazon Lay Off: ఇక అమెజాన్ వంతు.. 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన అమెజాన్

ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అమెజాన్ 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. గత కొన్ని త్రైమాసికాలు లాభదాయకంగా లేనందున నష్టాలను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Amazon Lay Off: ఇక అమెజాన్ వంతు.. 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన అమెజాన్

Amazon Lay Off: ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ అమెజాన్ 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. గత కొన్ని త్రైమాసికాలు లాభదాయకంగా లేనందున నష్టాలను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్, ఫేస్‌బుక్ యొక్క మెటా, తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించాయి. తాజాగా అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని, ఈ వారం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

Twitter Employees: ట్విటర్ నుంచి 50శాతం మంది ఉద్యోగులు ఔట్..? తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందన్న ట్విట్టర్

2021 డిసెంబర్ 31 నాటికి అమెజాన్లో దాదాపు 1,608,000 మంది ఫుల్ టైం, పార్ట్ టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న నష్టాలను అధిగమించేందుకు అమెజాన్ ఒక నెల సుదీర్ఘ సమీక్షల తర్వాత ఉద్యోగుల తొలగింపు నిర్ణయానికి మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో తొలుత 10వేల మందిపై వేటుపడే అవకాశం కనిపిస్తుంది. ఇదేజరిగితే, అమెజాన్ చరిత్రలో అతిపెద్ద ఉద్యోగుల తొలగింపు అవుతుంది. అమెరికా, యూరప్ వంటి అనేక పెద్దదేశాల ఆర్థిక వ్యవస్థల్లో హెచ్చుతగ్గులతో కంపెనీలు నష్టాల బాటపడుతున్నాయి. ఆ నష్టాలను పూడ్చుకొనేందుకు కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను సంఖ్యను తగ్గించుకుంటున్నాయని వ్యాపార వేత్తలు పేర్కొంటున్నారు.

Meta Sacks Employees: 11వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా.. క్షమాపణలు చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్ ..

ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ ఇప్పటికే తన కార్యకలాపాల్లో రోబోల వినియోగాన్ని పెంచుతోంది. ప్రస్తుతం, అమెజాన్ డెలివరీ చేసిన ప్యాకెట్లలో 3/4 ఏదో ఒక విధమైన రోబోటిక్ సిస్టమ్ ద్వారా వెళ్ళాయి. ఈ విషయమై అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టై బ్రాడీ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ప్యాకేజింగ్‌లో 100 శాతం రోబోటిక్ సిస్టమ్ రావచ్చని అంటున్నారు. ఈ రోబోలు మానవ ఉద్యోగులను ఎంత త్వరగా భర్తీ చేస్తాయో ఇంకా చెప్పనవసరం లేదు.