Meta Sacks Employees: 11వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా.. క్షమాపణలు చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్ ..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.

Meta Sacks Employees: 11వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా.. క్షమాపణలు చెప్పిన  మార్క్ జుకర్‌బర్గ్ ..

Meta

Meta Sacks Employees: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది. సెప్టంబర్ 30 నాటికి మెటా సంస్థలో 87వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా 13శాతం మంది ఉద్యోగులపై వేటు వేశారు.

Meta Platform: ట్విటర్ బాటలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉద్యోగుల తొలగింపునకు రంగంసిద్ధం?

నిరుత్సాహకర ఆదాయాలు, రాబడి తగ్గుదల నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ఖర్చులను తగ్గించుకొనే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయంపై మోటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడారు. ఈ రోజు నేను మెటా చరిత్రలో చేసిన కొన్ని కష్టతరమైన మార్పులను భాగస్వామ్యం చేస్తున్నాను. నేను మా బృందం సభ్యుల్లో సుమారు 13శాతం మందిని తగ్గించాలని నిర్ణయించుకున్నాను. మా ప్రతిభావంతులైన ఉద్యోగుల్లో 11వేల కంటే ఎక్కువ మందిని మేము తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగాలను కోల్పోతున్నారని, తొలగించిన ఉద్యోగులకు 16 వారాల ప్రాథమిక వేతనాన్ని చెల్లించనున్నామని తెలిపారు.

Financial Crisis Effect On IT Employees : అమెరికా నుంచి భారత్ వరకు..ఉద్యోగుల్ని తీసేస్తున్న కంపెనీలు..టెకీల్ని రోడ్డున పడేస్తున్న ద్రవ్యోల్బణం

ఈ నిర్ణయాలకు పూర్తిగా నేను జవాబుదారీగా ఉండాలనుకుంటున్నానని, ఇది ప్రతీ ఒక్కరికీ కష్టమని నాకు తెలుసని ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నందుకు తనను క్షమించాలని మార్క్ జుకర్‌బర్గ్ అన్నాడు. 2004లో ఫేస్‌బుక్‌ని స్థాపించిన తర్వాత మొదటిసారి ఖర్చులను తగ్గించుకొనేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో భారీగా ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకుంది.