Meta Platform: ట్విటర్ బాటలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉద్యోగుల తొలగింపునకు రంగంసిద్ధం?

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్న ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తుంది.

Meta Platform: ట్విటర్ బాటలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. ఉద్యోగుల తొలగింపునకు రంగంసిద్ధం?

Facebook

Meta Platform: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న బిలియనీర్ ఎలాన్ మస్క్ సంస్థలోని ఉద్యోగులపై వేటు వేశారు. ట్విటర్‌లోని కీలక విభాగాల్లో పనిచేసేవారి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు సంగం మందికి స్వస్తి పలికారు. సంస్థ రోజూ 40లక్షలు నష్టపోతుందని, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవటంకంటే మరోమార్గం తనకు కనిపించలేదని మస్క్ ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత ఇచ్చాడు. తాజాగా ట్విటర్ బాటలో నడిచేందుకు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సిద్ధమవుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ మెటా సంస్థ కూడా ఈ వారంలో అంటే బుధవారం వరకు ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధంచేస్తున్నట్లు తెలిపింది.

Elon Musk: మరో అవకాశం లేదు.. అందుకే కఠిన నిర్ణయం.. ఉద్యోగుల తొలగింపుపై స్పందించిన ఎలాన్ మస్క్ ..

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, టిక్‌టాక్ నుంచి పోటీ, ఆపిల్ సంస్థ నుంచి గోప్యతా మార్పులు, మెటావర్స్‌పై భారీ వ్యయం గురించి ఆందోళనలతో మెటా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనికితోడు ఇటీవల మెటా సంస్థలో వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ మార్క్ జుకర్‌బర్గ్‌కు రాసిన బహిరంగ లేఖలో.. కంపెనీ ఉద్యోగాలు, మూలధన వ్యయాలను తగ్గించడం ద్వారా నష్టాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. దీంతో ఈ వారంలో పెద్ద ఎత్తున మెటా సంస్థ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం ఇందుకు సంబంధించిన ప్రకటనసైతం మెటా సంస్థ నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడంతో ఇటీవల మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ట్విట్టర్, స్నాప్ లతో సహా పలు సాంకేతిక కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దీంతో పాటు కొత్తగా ఉద్యోగుల నియామకాలను కూడా తగ్గించాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా చేరేందుకు సిద్ధమవుతోంది.